కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్..ఎక్కడ చూసినా ధరల మోతే. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి..పెరిగిన ధరలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు..ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతుండగా వారాంతపు సంతల్లో కిలో రూ.60–80 పలుకుతున్నాయి. పచ్చిమిర్చి, చిక్కుడు సెంచరీ చేరువ అవుతుండగా.. బీన్స్ డబుల్ సెంచరీకి చేరువ అవుతుంది. నలుగురు ఉన్న కుటుంబంలో ఒక్కరోజు కూరగాయలకు కనీసం రూ.100పైనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సామాన్యులు వాపోతున్నారు.
మిగిలిన కూరగాయల్ని కేజీ 50పైనే ఉన్నాయి.. ధరలు పెరుగుదలకు దిగుబడి లేకపోవటమే కారణమంటున్నారు వ్యాపారులు..రీటైల్ మార్కెట్‌లో అయితే మరి అధిక ధరలకు అమ్ముతున్నారు వ్యాపారులు..దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. వర్షాలు కురిస్తే గాని సాధారణ పరిస్థితులు నెలకొనవు, ఎండలు ఎక్కువగా ఉండడంతో, సాగునీరు లేక రైతులు కూరగాయలు పండించడం లేదు. ఐతే మరో నెలరోజుల పాటు ధరలు ఇలానే ఉండే అవకాశం ఉందని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో జనం కూరగాయలు కొనాలంటే బెంబేలెత్తుతున్నారు. ఎండాకాలం…మండేకాలం.. దీంతో కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది.. ఉత్పత్తి తగ్గిపోవడంతో కూరగాయల ధరలు ఉట్టెక్కాయి.
ఇక ఇక ప్రస్తుతం అల్లం వెల్లుల్లి ధరలు కూడా మండిపోతున్నాయి. అల్లం ధర మార్కెట్లో బాగా పెరిగపోయింది. ఓపెన్ మార్కెట్లో ప్రస్తుతం అల్లం కేజి 250 నుంచి 300 రూపాయలు వరకు ఉంటుంది.. అలాగే రైతు బజార్లలో కొంటే 190 నుంచి 210 వరకు ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..