Telangana: రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్.. టాయిలెట్‌లోకి వెళ్లగా.. వ్యాక్

ఈ సీన్ చూశాక.. ఇంకోసారి బయటకు వెళ్లి ఫుడ్ తినాలంటే మీరు భయపడతారు. ఏంటి సామి మరీ ఇంత దారుణం.. తినే బిర్యానీ రైస్‌ను లెట్రిన్‌లో కమోడ్ వద్ద వాష్ చేస్తారా..? వీడియో చూస్తే మీక్కూడా కోపం వస్తుంది.. వివరాలు తెలుసుకుందాం పదండి..

Telangana: రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్.. టాయిలెట్‌లోకి వెళ్లగా.. వ్యాక్
Biryani Rice cleaning in Toilet
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 22, 2023 | 11:53 AM

హెటల్‌కి వెళ్లి.. ఆలోచించకుండా బిర్యానీ ఆర్డర్ ఇచ్చి.. వేడివేడిగా సర్వ్ చేయగానే.. ఆవురావురుమంటూ ఆరగించేస్తున్నారా..? ఆగండాగండి..  బయట అలాంటి ఫుడ్స్ తినేందుకు ఒకటికి వంద సార్లు ఆలోచించండి. ఎందుకంటే.. మీరు టేస్టీగా ఉందని లాగేంచేస్తున్న ఆ బిర్యానీ ప్రాసెసింగ్ టాయిలెట్‌లో జరిగి ఉండవచ్చు. అదేంటని నొసలు ఎగరేస్తున్నారా..? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా.. అయితే మీ కోసం వీడియోను సాక్ష్యంగా దిగువన ఇస్తున్నాం.. కళ్లు పెద్దవి చేసి చూడండి. ఒకసారి కాదు రెండు మూడు సార్లు రిపీట్ వేసి చూడండి.

చూశారుగా.. కస్టమర్స్ టాయిలెట్ కోసం బాత్రూంకి వెళ్తే.. అక్కడ బిర్యానీ రైస్ కడుగుతూ కనిపించారు అక్కడి స్టాఫ్. అచ్చంగా లెట్రీన్ కమోడ్ పక్కన ఈ తంతు జరుగుతుంది. ఇంకేముంది అక్కడి కస్టమర్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హోటల్ మేనేజర్‌ను పిలిచి చెడా మడా తిట్టారు.  సిద్దిపేటలోని సోని రెస్టారెంట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇదేంటని యాజమాన్యాన్ని అడిగితే.. మోటర్ కాలిపోయింది.. వాటర్ ప్రాబ్లం ఉందని రెస్టారెంట్ వాళ్ల నుంచి సమాధానం వచ్చింది. దీంతో మీది కాదు.. ఇక్కడ తినేందుకు వచ్చిన మాది తప్పు అని లెంపలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంట్లో అస్సలు తినకుండా బయట ఫుడ్ మాత్రమే ఆరగించే మహారాజులు మరొక్కసారి పై వీడియోపై లుక్కేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట
పెర్ట్ టెస్ట్ కోసం రవిశాస్త్రి ప్లేయింగ్ ఎలెవన్ అదిరిపోయిందిగా
పెర్ట్ టెస్ట్ కోసం రవిశాస్త్రి ప్లేయింగ్ ఎలెవన్ అదిరిపోయిందిగా