Telangana: ముత్యం పేట షుగర్‌ ఫ్యాక్టరీ పున:ప్రారంభం.. మంత్రి కీలక ప్రకటన

ధరణి ప్రక్షాళన.. ప్రాజెక్టులపై శ్వేతపత్రం.. ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన.. వాట్‌ నాట్‌ అన్ని రంగాల్లో మార్పు మార్క్‌ చాటుతోంది కాంగ్రెస్‌ సర్కార్‌. అలాగే తెలంగాణ మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్దరణపై రేవంత్‌ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. త్వరలో ముత్యం పేట షుగర్‌ ఫ్యాక్టరీని పున:ప్రారంభిస్తామన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. గత BRS ఫ్రభుత్వ నిర్లక్ష్యం వల్ల షుగర్‌ ఫ్యాక్టర్‌ మూతపడిందన్నారాయన.

Telangana: ముత్యం పేట షుగర్‌ ఫ్యాక్టరీ పున:ప్రారంభం.. మంత్రి కీలక ప్రకటన
Sridhar Babu

Updated on: Mar 06, 2024 | 10:14 PM

ధరణి ప్రక్షాళన.. ప్రాజెక్టులపై శ్వేతపత్రం.. ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన.. వాట్‌ నాట్‌ అన్ని రంగాల్లో మార్పు మార్క్‌ చాటుతోంది కాంగ్రెస్‌ సర్కార్‌. అలాగే తెలంగాణ మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్దరణపై రేవంత్‌ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. త్వరలో ముత్యం పేట షుగర్‌ ఫ్యాక్టరీని పున:ప్రారంభిస్తామన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. గత BRS ఫ్రభుత్వ నిర్లక్ష్యం వల్ల షుగర్‌ ఫ్యాక్టర్‌ మూతపడిందన్నారాయన. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు శ్రీధర్‌బాబు. ఇచ్చిన మాట ప్రకారం ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తామన్నారు. ఆర్ధికంగా భారమైనా సరే ఇచ్చిన హామీకి కట్టుబడి వుంటామన్నారాయన. అందరి సహకారంతో ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ 2025 కల్లా అందుబాటులోకి వస్తుందన్నారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు శ్రీధర్‌ బాబు. కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారాయన. ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ గేట్లు ఓపెన్‌ చేసి ముందడుగు వేశామన్నారు. చక్కెర ఫ్యాక్టరీ తో పాటుగా ఇథనాల్ ప్రాజెక్టు కూడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. బోదన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ ని కూడా పరిశీలించామన్నారు. షుగర్ ఫ్యాక్టరీ భూములు బ్యాంకులో‌ తనఖా పెట్టారు. వాటిని విడిపించాల్సిన అవసరం వుందన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు.