Renuka Chowdhury comments on TRS Party: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు ఈ మధ్యనే కాంగ్రెస్‌పై ఇంట్రెస్ట్ పెరిగిందంటూ రేణుకా చౌదరి మంగళవారం గాంధీభవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. కానీ మేము అంత ఇంట్రెస్ట్‌గా లేమంటూ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ తో కలిసి పని చేసేందుకు సిద్దంగా లేరంటూ పేర్కొన్నారు. టీఆర్ఎస్ తమకు ఎంత దూరం ఉంటే అంత మంచిదంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay Kumar) పై రేణుక చౌదరి ఫైర్ అయ్యారు. పువ్వాడ అజయ్ కుమార్ కి.. కేటీఆర్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఖమ్మంలో జరుగుతున్న అన్యాయాలపై పువ్వాడ మీద ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తో బిజినెస్ సంబంధాలు ఉన్నాయని అని పువ్వాడా చెప్పుకుంటారంటూ పేర్కొన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జరుగుతున్న అక్రమాలు కేటీఆర్ కు తెలియవా..? అంటూ ప్రశ్నించారు. పోలీసులు దిగజారి పోయారంటూ మండిపడ్డారు.
రజాకార్లను ఎదుర్కొన్న పోలీసులు.. ఇప్పుడు ఇలా మారిపోవడం దురదృష్టకరం అంటూ పేర్కొన్నారు. ఏసీపీ ఆధ్వర్యంలోనే ఖమ్మంలో కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఖమ్మంలో జరిగే ప్రతి దానికి ఏసీపీ కారణం అంటూ వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఖమ్మం రాకుండా అడ్డుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను ఖమ్మం జిల్లా ఆడ బిడ్డనని.. ఖమ్మంలో తనకంటే మంచి కాంగ్రెస్ లీడర్ ఎవరున్నారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఖమ్మంలో జరుగుతున్న అన్యాయాలపై టీపీసీసీతో కలిసి ఆందోళన చేస్తానంటూ పేర్కొన్నారు.
కాగా.. అమరావతిని కమ్మరావతిగా చేయాలంటూ.. ఏపీ సీఎంపై రేణుకా చౌదరి డిమాండ్ చేసిన తెలిసిందే. కమ్మ కులాన్ని తక్కవ చేసి హేళన చేస్తున్నారంటూ శుక్రవారం ఆమె సీఎం జగన్‌ను విమర్శించారు. దీనిపై రేణుకా మాట్లాడుతూ కమ్మ అని చెప్పుకొనే అర్హత కూడా లేకుండా చేస్తున్నారన్నారు. కమ్మ అని ముద్ర వేసి లైట్‌గా మాట్లాడుతున్నారని.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. చరిత్ర తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారన్నారు.
Also Read: