ఢిల్లీ, సెప్టెంబర్ 28: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకిలోకి మరో ఎమ్మెల్యే చేరారు. అంతా ఊహించినట్టే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సీనియర్ నేత, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలోకి మారారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్‌తో కలిసి సెప్టెంబర్ 28 గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఎ రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఈరోజు పార్టీలో చేరారు.
బీఆర్‌ఎస్ పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదని ఆరోపిస్తూ హనుమంతరావు ఇటీవల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రాజీనామా లేఖను అందించారు. అలాగే పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అధికార దాహంతో ఉన్న కొంతమంది వ్యక్తుల చేతుల్లో బీఆర్‌ఎస్ కీలుబొమ్మగా మారిందని హనుమంతరావు ఆరోపించిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడానికి అగ్ర నాయకత్వం నిరాకరించడంతో ఆయన బీఆర్‌ఎస్ నుంచి వైదొలిగినట్లు సమాచారం.
#WATCH | Delhi: BRS MLA Mynampally Hanumantha Rao along with his son joined the Congress Party in the presence of the Congress president Mallikarjun Kharge and party’s Telangana unit chief Anumula Revanth Reddy.
BRS Ex MLA Vemula Veeresham also joined the party today. pic.twitter.com/rLG2pMHcgL
— ANI (@ANI) September 28, 2023
తన కుమారుడు రోహిత్‌తో కలిసి కొద్దిసేపటి కిందటే ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. సూటిగా, సుత్తిలేకుండా.. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన ప్రకటన ఇది. అనుచరులు, శ్రేయోభిలాషుల సలహాల మేరకు అంటూ కారు దిగేశారాయన. కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్‌లో మైనంపల్లి ఎపిసోడ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
కారు పార్టీలో తనతో పాటు తన కుమారుడికి టికెట్ ఆశించిన మైనంపల్లికి భంగపాటే ఎదురైంది. మల్కాజిగిరి సీటు ఆయనకు కేటాయించినప్పటికీ ఆయన అసంతృప్తిగా ఉన్నారు. మెదక్ సీటు తన కుమారుడికి ఇప్పించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. దీంతో ఏకంగా మంత్రి హరీష్‌రావుపైనే తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. దీనిపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.