Viral Video: ఏంటన్నా అదేమైన కట్టే పుల్ల అనుకుంటివా.. ఇట్టే పట్టేశావ్.. వీడియో చూస్తే దడ పుట్టాల్సిందే..

అందరూ.. మొక్కలు నాటేందుకు రెడీ అయ్యారు. ప్రతి ఒక్కరు.. చేతిలో మొక్క పట్టుకున్నారు.. కానీ.. ఇంతలో.. అలికిడి.. ఓ పాము అక్కడికి చేరుకుంది. దీంతో అందరూ కంగారు పడ్డారు.. ఆ పాము అటు.. ఇటు పరుగులు పెట్టడంతో అందరూ పరుగులు తీశారు.. ఇంతలో అక్కడున్న అధికారి ఆ పామను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: ఏంటన్నా అదేమైన కట్టే పుల్ల అనుకుంటివా.. ఇట్టే పట్టేశావ్.. వీడియో చూస్తే దడ పుట్టాల్సిందే..
Snake Video

Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 13, 2025 | 3:33 PM

అందరూ.. మొక్కలు నాటేందుకు రెడీ అయ్యారు. ప్రతి ఒక్కరు.. చేతిలో మొక్క పట్టుకున్నారు.. కానీ.. ఇంతలో.. అలికిడి.. ఓ పాము అక్కడికి చేరుకుంది. దీంతో అందరూ కంగారు పడ్డారు.. ఆ పాము అటు.. ఇటు పరుగులు పెట్టడంతో అందరూ పరుగులు తీశారు.. ఇంతలో అక్కడున్న అధికారి ఆ పామను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొద్దీ సేపు తరువాత.. యధావిధిగా.. వన మహోత్సవం కార్యక్రమం జరిగింది. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ గ్రౌండ్ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా అక్కడ పాము అక్కడ ప్రత్యక్షమైంది. దీంతో అధికారులు, విద్యార్థులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. అటు.. ఇటు పరుగులు తీశారు.

పాము కూడా అదే ప్రాంతంలో సంచరిస్తూ కంగారు పెట్టించింది. దీంతో అందరూ.. దూరంగా వెళ్లిపోయారు. అయితే అక్కడే ఉన్న పెద్దపల్లి మున్సిపల్ 23 వ వార్డు ఆఫీసర్ యశ్వంతరావు పామును పట్టుకుంటానని ముందుకొచ్చారు. అయితే.. అక్కడున్న వారు వద్దని చెప్పారు.. కానీ.. ఆయన పామును పట్టుకోవడానికి దగ్గరికి వెళ్లారు. కొద్దిసేపు పాము ఇబ్బంది పెట్టింది.. తరువాత.. చాకచక్యంగా పట్టుకొని, దూరంగా వదిలేశారు.

వీడియో చూడండి..


దీంతో అక్కడ ఉన్న అధికారులు, విద్యార్థులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తరువాత.. జెర్రిపోతు పామును దూరంగా వదిలిపెట్టారు. పామును.. దూరంగా వదిలేయడంతో యాదవిధిగా.. మొక్కలు నాటారు.. పామును పట్టిన వ్యక్తిని ఉన్నతాధికారులు అభినందించారు.. అయితే.. జెర్రిపోతు పాము కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదని.. అదే త్రాచుపాము లాంటి ప్రమాదకర పాము అయితే.. జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు స్నేక్ క్యాచర్స్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..