AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmal: తన పెళ్లి పత్రికలు పంచేందుకు బంధువుతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు.. ఇంతలో

పెండ్లి పత్రికలు పంచేందుకు వెళ్తున్న పెండ్లికొడుకు, అతని బంధువు రోడ్డు ప్రమాదం జరిగి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి వారం రోజులు మిగిలి ఉండగానే వరుడికి మృత్యువు ముంచుకొచ్చింది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Nirmal: తన పెళ్లి పత్రికలు పంచేందుకు బంధువుతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు.. ఇంతలో
Bike Accident
Ram Naramaneni
|

Updated on: Jul 13, 2025 | 3:30 PM

Share

పెండ్లి పత్రికలు పంచే పనిలో ఉన్న ఇద్దరు యువకులు ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా వద్ద శనివారం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్‌పల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మన్‌కు వారం రోజుల్లో పెండ్లి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బంధువైన మురిమడుగు జస్వంత్‌తో కలిసి బైక్‌పై నిర్మల్ వైపు పెండ్లి పత్రికలు పంచడానికి బయలుదేరాడు.

అయితే ఖానాపూర్ చేరుకునేలోపే బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కల్వర్టును ఢీకొని చెట్ల పోదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మన్, జస్వంత్ ఇద్దరూ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు.

మరి కొన్ని రోజుల్లో ఇంట్లో శుభకార్యం అనుకుంటున్న వేళ జరిగిన ఈ విషాదం కుటుంబాన్ని విషాదసంద్రంలోకి నెట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఉచ్ఛస్థితిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి కొత్త జీవితం పక్కా..!
ఉచ్ఛస్థితిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి కొత్త జీవితం పక్కా..!
ఇది కదా శుభవార్త.. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఫిక్స్!
ఇది కదా శుభవార్త.. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఫిక్స్!
మా ప్లేయర్లను అంటే ఊరుకోం..ఫేక్ న్యూస్‌పై నిప్పులు చెరిగిన ప్రీతి
మా ప్లేయర్లను అంటే ఊరుకోం..ఫేక్ న్యూస్‌పై నిప్పులు చెరిగిన ప్రీతి
అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి అవతార్ 3.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి అవతార్ 3.. తెలుగులోనూ స్ట్రీమింగ్
రైలు టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో బుకింగ్‌కు ముందే తెలుసుకోవచ్చు
రైలు టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో బుకింగ్‌కు ముందే తెలుసుకోవచ్చు
ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..!
ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..!
అన్నం కంటే అదే బెటర్.. ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రివేళ చపాతీ తినండి
అన్నం కంటే అదే బెటర్.. ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రివేళ చపాతీ తినండి
బుధాదిత్య యోగం.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, ఉన్నత పదవులు
బుధాదిత్య యోగం.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, ఉన్నత పదవులు
ఈ బ్యూటీ డ్రెస్ వెనుక అద్భుత కళాఖండం
ఈ బ్యూటీ డ్రెస్ వెనుక అద్భుత కళాఖండం
పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ వరాల వర్షం..
పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ వరాల వర్షం..