AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas E-Kyc: గ్యాస్ ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా..? మీ మొబైల్‌లోనే సింపుల్‌గా ఇలా చేయొచ్చు.. సెకన్లలోనే పని పూర్తి..

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఈకేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం పెంచింది. గతంలో ఆగస్ట్ 16 వరకు సమయం ఇవ్వగా.. ఇప్పుడు ఆగస్ట్ 23 వరకు పొడిగించారు. దీంతో ఇప్పటికైనా వినియోగదారులు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం.

LPG Gas E-Kyc: గ్యాస్ ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా..? మీ మొబైల్‌లోనే సింపుల్‌గా ఇలా చేయొచ్చు.. సెకన్లలోనే పని పూర్తి..
Gas Ekyc
Venkatrao Lella
|

Updated on: Aug 18, 2026 | 8:42 AM

Share

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ఊరట కలిగించాయి. ఈ నెల 16వ తేదీతో ముగిసిన ఈకేవైసీ గుడువును ఆగస్ట్ 23వ తేదీ వరకు పొడిగించాయి. మరో వారం రోజుల పాటు సమయం ఇవ్వడంతో చేసుకోనివారికి మరిన్ని రోజులు అవకాశం ఉంది. గ్యాస్ కేవైసీని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేకపోతే మీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు నిలిచిపోతాయి. మళ్లీ మీరు కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాతనే డబ్బులు అకౌంట్లో పడతాయి. గ్యాస్ సరఫరాలో పారదర్శకత, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకుని నిజమైన వినియోగదారులను గుర్తించేందుకు ప్రభుత్వం  ఈ ప్రక్రియ చేపట్టింది. ఇది పూర్తి చేసేందుకు మీరు డీలర్ షిప్ కార్యాలయాల వద్ద గంటల కొద్ది వెయిట్ చేయాల్సిన పని లేదు. మీ మొబైల్‌లోనే సులువుగా కంప్లీట్ చేయవచ్చు. మీరు ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్.. ఇలా ఏ కంపెనీ వినియోగదారులైనా మొబైల్‌లోనే ఈజీగా చేసుకోవచ్చు. అదెలా అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం.

ఇండేన్ కస్టమర్లు ఎలా చేసుకోవాలి..?

-ముందుగా మొబైల్‌లో ఇండియన్ ఆయిల్ వన్, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోండి

-ఇండియన్ ఆయిల్ వన్ యాప్ తెరవండి

-మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్‌తో సైన్ అప్ అవ్వండి

-అనంతరం మీ వివరాలతో లాగిన్ అవ్వండి

-యాప్‌లోకి వెళ్లాక లింక్ మై ఎల్‌పీజీ ఐడీపై క్లిక్ చేయండి

-16 అంకెల ఎల్పీజీ ఐడీ నమోదు చేయండి

-అనంతరం మై ప్రొఫైల్ విభాగానికి వెళ్లండి

-ఇండేన్ డీటైల్స్ ఆప్షన్ ఎంచుకోండి

-రీకేవైసీపై క్లిక్ చేయండి

-అనంతరం ప్రొసీడ్‌పై క్లిక్ చేసి ప్రాసెస్ చేయండి

-ఫేస్ స్కాన్ చేసి బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయండి

హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు ఎలా..?

-హెచ్‌పీ పే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

-యాప్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి

-హోమ్ పేజీలో ఎల్పీజీ ఆప్షన్ ఎంచుకుని ఈకేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-క్యాప్చర్ ఫేస్ ఆప్షన్ ఎంచుకోండి

-ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ ద్వారా ఫేస్ స్కాన్ చేస్తే కేవైసీ పూర్తవుతుంది.

భారత్ గ్యాస్ వినియోగదారులకు ఎలా..?

-భారత్ గ్యాస్ వినియోగదారులు హలో బీపీసీఎల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

-అనంతరం మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి

-ఈకేవైసీ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోండి

Follow Us
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు