Telangana: కార్చిచ్చు ఆర్పేందుకు అడవిలోకి వెళ్లిన అధికారులు.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కింది చూసి షాక్

ఎలుగుబంటి ఆకారాన్ని పోలి ఉంది.. కొద్దిగా పునుగు పిల్లిలా కూడా అనిపిస్తుంది. ఈ జంతువు చర్మం, ఎలాస్టిక్​ మాదిరి సాగుతుంది. అడవిలోకి వెళ్లిన అధికారులు... ఆ జీవి అక్కడ కనిపించడం చూసి కంగుతిన్నాడు. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుందని గమనించి.. రెస్క్యూ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇంతకీ ఏంటా జీవి...

Telangana: కార్చిచ్చు ఆర్పేందుకు అడవిలోకి వెళ్లిన అధికారులు.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కింది చూసి షాక్
Honey Badger Rescued

Updated on: Mar 08, 2025 | 5:38 PM

అదో అరుదైన వన్యప్రాణి.. దానికి తేనె తీగల నుంచి వచ్చే లార్వా అంటే మహా ఇష్టం. కీటకాలు, క్షీరదాలు, పక్షులు, పాములు, అడవి దుంపలు, పండ్లను ఆహారంగా తీసుకుంటాయి. చాలా తెలివైన జీవిగా దీనికి పేరుంది.  నాగుపాము కరిచినా తట్టుకోగలికే కెపాసిటీ దీని సొంతం. అంతేనా.. ఎలాంటి జంతువుకు అయినా ఇది అంటే హడల్. పులి, చిరుత వంటి జంతువులను సైతం ధీటుగా ఎదుర్కొంటుంది.  కారణం బలమైన దంతాలు, పదునైన గోళ్లు, ఎటు కావాలంటే అటు తిరగగల శరర నిర్మాణం.  ఇంతకీ దాని పేరు ఏంటి అనుకుంటున్నారా. హనీ బ్యాడ్జర్.  భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం.. 1972 ప్రకారం ఈ జీవి.. షెడ్యూల్ 1 కేటగిరీలో ఉంది. అయితే మాంసం కోసం, ఔషధాలలో ఉపమోగించడం వంటి కారణాల చేత.. హనీ బ్యాడ్జర్ ఇప్పుడు వేటగాళ్ల హాట్ ఫేవరెట్ అయిపోయింది.

తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల బోర్డర్… నూగూరు ఫారెస్ట్ ఏరియాలో…  అటవీ సిబ్బంది ఈ హనీ బ్యాడ్జర్‌ను గుర్తించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ప్రాంతంలో అడవిలో కార్చిచ్చు రేగింది. ఈ మంటలను స్టానిక ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది అడవిలోకి వెళ్లారు.  అయితే వారు వెళ్లే మార్గంలో ఓ హనీ బ్యాడ్జర్ వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిక్కుకుని కనిపించింది. దీంతో వెంటనే అలెర్టైన అధికారులు దాన్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. ఆకలి దప్పులతో ఎంతకాలం నుంచి అది అలా ఉందో…  ఫారెస్ట్ సిబ్బందిపై అది దూసుకువచ్చింది. దీంతో చాకచక్యంగా వ్యవహరించి.. దాన్ని కాపాడారు. ఉచ్చు నుంచి తప్పించుకున్న హనీ బ్యాడ్జర్ అక్కడి నుంచి పరుగులు తీసింది. దీనిని రాటిల్ అని కూడా పిలుస్తారని.. అధికారులు తెలిపారు. ఈ హనీ బ్యాడ్జర్​ 55 నుంచి 77 సెంటీమీటర్ల పొడవుతో సుమారు 16 కేజీల వరకు ఉంటుందన్నారు.

హనీ బ్యాడ్జర్ వీడియో దిగువన చూడండి… 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..