Governor Tamilisai: మరోసారి గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్‌భవనే దగ్గర.. కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ ఆగ్రహం..

Raj Bhavan Vs Pragathi Bhavan: ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య సంబంధాలు రచ్చగా మారాయి. గవర్నర్‌ అండ్ గవర్నమెంట్‌ మధ్య ఏర్పడిన వివాదాలతో బిల్లులన్నీ ఆగిపోయాయి. దీంతో గవర్నర్‌ టార్గెట్‌గా అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది కేసీఆర్‌ సర్కార్‌..

Governor Tamilisai: మరోసారి గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్‌భవనే దగ్గర.. కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ ఆగ్రహం..
Telangana

Updated on: Mar 03, 2023 | 12:08 PM

Raj Bhavan Vs Pragathi Bhavan: ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య సంబంధాలు రచ్చగా మారాయి. గవర్నర్‌ అండ్ గవర్నమెంట్‌ మధ్య ఏర్పడిన వివాదాలతో బిల్లులన్నీ ఆగిపోయాయి. దీంతో గవర్నర్‌ టార్గెట్‌గా అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది కేసీఆర్‌ సర్కార్‌.. కేసీఆర్ ప్రభుత్వం వేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, సీఎం తీరుపై విమర్శలు గుప్పించారు. బిల్లులు ఆమోదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీకోర్టుకు వెళ్లడంపై.. పరోక్షంగా విమర్శలు చేశారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉందంటూ గవర్నర్ తమిళిసై గుర్తుచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్‌ శాంతికుమారిపై గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్‌భవన్‌కు రావడానికి టైమ్‌ లేదా అంటూ గవర్నర్‌ సీఎస్ ను విమర్శించారు. ప్రొటోకాల్‌ పాటించరా..? ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉందన్న విషయం గుర్తించుకోవాలని.. మరోసారి గుర్తుచేస్తున్నానంటూ పేర్కొన్నారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన మీకు.. అధికారికంగా రాజ్‌భవన్‌ని సందర్శించడానికి టైం దొరకలేదు.. మర్యాదపూర్వకంగా పిలిచినా మర్యాద లేదు అంటూ గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తంచేశారు. స్నేహపూర్వకంగా సందర్శించినా, మాట్లాడినా.. ఇంతకంటే సులువుగా బిల్లులు ఆమోదం జరిగేవి అంటూ తమిళిసై వివరించారు. స్నేహపూర్వక చర్చల ద్వారానే బిల్లులు ఆమోదం పొందుతాయని గవర్నర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..