Rain Alert: తెలంగాణలో పొంగుతున్న వాగులు.. జల దిగ్బంధంలో సిరిసిల్ల.. 11న మరో అల్పపీడనం..

|

Sep 08, 2021 | 8:26 AM

గత వారం రోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్ధవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు..

Rain Alert: తెలంగాణలో పొంగుతున్న వాగులు.. జల దిగ్బంధంలో సిరిసిల్ల.. 11న మరో అల్పపీడనం..
Rain Alert
Follow us on

గత వారం రోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్ధవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణలో 3 రోజులు వరుణుడి విరామం ఇవ్వనుంది.

ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రెండు రోజుల క్రితం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఛత్రిగడ్ వైపు కదులుతుంది. ఈ అల్పపీడనం ప్రయాణించిన మార్గంలో 20 సే.మీ పైనే వర్షపాతం నమోదైంది. ఇక ఈ నెల 11న మళ్ళీ అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉత్తర తెలంగాణలోని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపోయాయి. పలు చోట్ల రహదారులు తెగిపోయి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. మరికొన్ని చోట్ల ప్రాణ నష్టం జరిగింది. నిన్న కురిసిన వర్షానికి కరీంనగర్ 15, వరంగల్ 20 కాలనీలు జలమయమయ్యాయి. గత ఏడాది 24 గంటల్లో హైదరాబాద్లో కురిసిన 20 సే.మీ వర్షపాతానికే జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలాగే వరంగల్ లో 38 సే.మీ పైనే వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలతోపాటు.. ప్రధాన రహదారులు పూర్తిగా వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఇక నిన్న కురిసిన వర్షంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉండిపోయాయి. నిజామాబాద్‏లో అత్యధికంగా 13.13 సే.మీ నమోదయ్యింది. అటు గ్రామీణ ప్రాంతాల్లో మత్తడి దూకుతున్నాయి. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.

Also Read: Karthika Deepam: దీపను చూసి మోనిత పరుగో పరుగు.. దీప కోసం కార్తీక్ వెతుకులాట!

Tollywood Drug Case: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్.. సెలబ్రిటీలకు ఈడీ వేడి.. ఈరోజు ఈడీ ముందుకు రానా దగ్గుబాటి.. ముమైత్ ఖాన్..