Telangana Rain Alert: రానున్న మూడు రోజులకు తెలంగాణ వెదర్ రిపోర్ట్‌ను హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఉపరితల అవర్తనం ఏర్పడింది. దీనికి తోడు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఉపరితల ద్రోణి కొనసాగుతుంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్ జిల్లా మొయిన్‌పేటలో 31.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పలు చోట్ల పంటలు దెబ్బతినగా.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. పిడుగుపాటుకు ఇద్దరు బలయ్యారు.
కరీంనగర్ లో అకాల వర్షానికి అన్నదాతలు అతలాకుతల మయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న దాన్యం నిల్వలను కాపాడుకోటానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. వర్షం వరుస బీభత్సం సృష్టిస్తుండటంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన వరి పంట ఓ వైపు, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం నిల్వలు మరో వైపు ఉండ డంతో రైతన్నలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. వరుసగా వర్షాలు వస్తుండటంతో అస లు అన్నాదాతలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు, జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 9వ తేదీ నాటికి తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని, తెలంగాణలో మాత్రం సాధారణానికి మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..
Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?