Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలెర్ట్.. మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు.!

|

Sep 08, 2022 | 8:34 AM

ఇక వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. ఎండ ఇరగకాస్తోందని సంబర పడేలోపే.. వరుణుడు పగబట్టినట్టు.. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో..

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలెర్ట్.. మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు.!
Rains In Hyderabad
Follow us on

ఇక వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. ఎండ ఇరగకాస్తోందని సంబర పడేలోపే.. వరుణుడు పగబట్టినట్టు.. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వాన దంచి కొట్టింది. ఒక్కసారిగా జనజీవనం స్తంబించింది.. జల దిగ్బంధంలోకి జారిపోయింది. ఎటు చూసినా నీళ్లే.. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలెర్ట్ అందించింది వాతావరణ శాఖ.. వచ్చే మూడు రోజుల్లో కూడా వర్షాలు దంచికొట్టనున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని ప్రజలకు సూచించింది.

తెలంగాణలో వర్షాలే వర్షాలు…

తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.. ఈ నెల 9వ తేదీన అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌లను జారీ చేసింది.

మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

శనివారం వరకు ఏపీలో వర్షాలే..

ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలోని పలు చోట్ల అయితే.. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే తీరం వెంబడి 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కాగా, మంగళవారం అత్యధికంగా వెంకటగిరిలో 9.1 సెంటీమీటర్లు.. గుత్తిలో అత్యల్పంగా 4.2 సెం.మీల వర్షపాతం నమోదైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..