Hyderabad police: గచ్చిబౌలి డ్రగ్స్‌ కేసులో గోవా లింక్స్‌

|

Mar 03, 2024 | 12:35 PM

డ్రగ్స్‌కు రాజధానిలా మారిన గోవా నుంచి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయి. ఈ విషయాన్ని TV9లో గతంలో ఆపరేషన్‌ చార్లి పేరుతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి చాటిచెప్పింది. ఇప్పుడు రాడిసన్‌ హోటల్లో జరిగిన పార్టీకి కూడా గోవా నుంచే డ్రగ్స్‌ సరఫరా అయ్యాయని పోలీసులు నిర్థారించారు. దీంతో ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. 

Hyderabad police: గచ్చిబౌలి డ్రగ్స్‌ కేసులో గోవా లింక్స్‌
Drugs Case
Follow us on

సంచలనం సృష్టించిన గచ్చిబౌలి డ్రగ్స్‌ కేసులో మిస్సింగ్‌ లింక్స్‌ను పోలీసులు ఛేదిస్తున్నారు. కొన్నిరోజులుగా దుమారం రేపుతున్న ఈ కేసులో కీలక పరిణామం ఇది. పార్టీ వాడిన కొకైన్- గోవా నుంచి హైదరాబాద్‌కు సరఫరా అయినట్లు నిర్ధారించారు. గోవా వ్యాపారి అబ్దుల్‌ అక్కడినుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ పంపాడు. అబ్దుల్‌ నుంచి రెహ్మాన్‌కు డ్రగ్స్‌ అందాయి. రెహ్మాన్‌ చేతుల నుంచి మీర్జాకు డ్రగ్స్‌ వెళ్లాయి. మీర్జా ఈ డ్రగ్స్‌ను అబ్బాస్‌కు అందించాడు. అబ్బాస్‌ చేతుల మీదగా ఈ కొకైన్‌ ప్రవీణ్‌కు చేరింది. గచ్చిబౌలి పార్టీలోకి డ్రగ్స్‌ను ప్రవీణ్‌ చేరవేశాడని పోలీసులు చెబుతున్నారు.

డ్రగ్స్‌కు రాజధానిలా మారిన గోవా నుంచి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయి. ఈ విషయాన్ని TV9లో గతంలో ఆపరేషన్‌ చార్లి పేరుతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి చాటిచెప్పింది. ఇప్పుడు రాడిసన్‌ హోటల్లో జరిగిన పార్టీకి కూడా గోవా నుంచే డ్రగ్స్‌ సరఫరా అయ్యాయని పోలీసులు నిర్థారించారు. దీంతో ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచారు.

ఇక ఈ కేసులో మొత్తం పది మంది ఉన్నట్లు FIR స్పష్టం చేస్తుండగా.. వివేకానంద, అతనికి మాదక ద్రవ్యాలు సరఫరా చేసే అబ్బాస్‌, కేదార్‌, నిర్భయ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అబ్బాస్‌ అలీ ఫోన్‌లో చాలామంది సెలబ్రిటీల నంబర్స్ ఉన్నాయి. రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో అబ్బాస్‌ అలీతో పలువురు చాటింగ్ చేశారని పోలీసులు ఐడెంటిఫై చేశారు. రాడిసన్‌ హోటల్‌లో గజ్జల వివేకానంద్‌కు 10 సార్లు మాదక ద్రవ్యాలు సప్లయ్‌ చేసినట్లుగా అతడు ఎంక్వైరీలో చెప్పారు..ఈ కేసులో మొత్తం పది మందిపై పోలీసులు FIR‌ నమోదు చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్‌ చేయగా..మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అటు రాడిసన్ హోటల్‌లో సీసీ ఫుటేజ్‌ని డిలీట్ చేశారు హోటల్ నిర్వాహకులు..హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు.

డ్రగ్స్ కేసుల్లో తరచూ సినీ తారల పేర్లు వినిపిస్తూ ఉండటంతో ఇండస్ట్రీకి ఇదో మాయని మచ్చలాగా మారింది. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుంచి తాజా రాడిసన్ డ్రగ్స్ కేసు వరకు అనేక కేసుల్లో సినీ ప్రముఖులు ప్రత్యక్షమయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి మొదలుకొని సినీ హీరోలు డైరెక్టర్ల వరకు.. చాలా మందికి డ్రగ్ పార్టీలతో లింకులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతటి వారైనా సరే డ్రగ్స్ తీసుకుంటే.. ఆ తారలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…