ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ హైదరాబాద్‌కు చేరుకుంది. దేశంలోనే మొట్టమొదటి ఈ-ప్రిక్స్‌ను నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిర్వహించడంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో బృందం కీలక పాత్ర పోషించింది.
దేశంలోనే మొట్టమొదటిసారి హైద్రాబాద్‌లో జరుగుతున్నా ఫార్ములా ఈ రేసు నిర్వహించడంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో బృందం కీలక పాత్ర పోషించింది. బుధవారం విమానాశ్రయంలోని కార్గో విభాగానికి 90 టన్నుల రేసింగ్ కార్ల భాగాలు చేరుకున్నాయి. బుధవారం రాత్రి 11.50 గంటలకు రియాద్ నుంచి బోయింగ్ 747-400 చార్టర్ విమానం ద్వారా ఆటో విడిభాగాలు శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌కు చేరుకున్నాయి. మరో రెండు విమానాలలో మిగతా రేసింగ్ కార్ల భాగాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి గ్లోబల్ మోటార్‌స్పోర్ట్, ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 11 జట్లు పోటీ పడుతున్నాయి.
ఆటో విడిభాగాలకు చెందిన 83 బాక్స్‌లతో కూడిన కార్గో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్లాట్ల వద్ద నిలిపిన విమానం నుండి ఆఫ్‌లోడ్ చేసారు. వాటిని అన్‌లోడింగ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన కార్గో హ్యాండ్లింగ్ పరికరాలను ఉపయోగించి జీహెచ్ఏఆర్ టెర్మినల్‌లోపలికి తరలించారు. ఇ-ఫార్ములా బృందానికి సహాయం చేయడానికి, షిప్‌మెంట్ ప్రక్రియ సమర్థవంతమైన నిర్వహణ కోసం హైదరాబాద్ కార్గో వారు ఒక మల్టీ-స్టేక్‌హోల్డర్ క్రాక్ టీమ్ ఏర్పాటు చేసారు. దేశంలో మొట్టమొదటి ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ కోసం నిరాటంకమైన ఎయిర్ కార్గో సదుపాయాలను అందించడంలో హైదరాబాద్ విమానాశ్రయం పాత్ర పోషించడం గర్వంగా ఉందన్నారు ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ పణికర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..