ధాన్యం కొనుగోలుకు రూ. 7 వేల కోట్లుః హరీష్‌రావు

| Edited By: Anil kumar poka

Oct 18, 2019 | 5:15 PM

ధాన్యం కొనుగోలు కోసం ముఖ్యమంత్రి రూ.7వేల కోట్లు కేటాయించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మార్కెట్‌లో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. వరికి రూ.1835, పత్తికి రూ.5550 మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట జిల్లాలో 169 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. పత్తి కొనుగోలు కోసం జిల్లాలో 32 సీసీఐకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలోని […]

ధాన్యం కొనుగోలుకు రూ. 7 వేల కోట్లుః హరీష్‌రావు
Follow us on

ధాన్యం కొనుగోలు కోసం ముఖ్యమంత్రి రూ.7వేల కోట్లు కేటాయించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మార్కెట్‌లో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. వరికి రూ.1835, పత్తికి రూ.5550 మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట జిల్లాలో 169 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. పత్తి కొనుగోలు కోసం జిల్లాలో 32 సీసీఐకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలు యధావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారని, ఈ సారి 2,25,000 మెట్రిక్ టన్నుల పత్తి మార్కెట్ కు వస్తుందని భావిస్తున్నామని అన్నారు. హరీష్‌రావు పర్యటనలో భాగంగా తొలుత జిల్లా కేంద్రంలోని శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ 19 వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి వేద విద్వాన్‌ మహా సభలకు హాజరయ్యారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో తెలంగాణ వేద విద్వాన్‌ మహాసభలు జరిపే అవకాశం ఇవ్వడం మా అదృష్టం అని, 4 రోజులపాటు సిద్ధిపేట వేదఘోషతో సుభిక్షమవుతుందన్నారు..వేద పరిరక్షణకు ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు