Priyanka Gandhi: ఇవాళ హైదరాబాదులో యువ సంఘర్షణ సభ.. ఫస్ట్‌ టైమ్‌ తెలంగాణకు ప్రియాంక గాంధీ..

|

May 08, 2023 | 6:51 AM

తెలంగాణలోని నిరుద్యోగులకు భరోసా కల్పించడానికే ప్రియాంకగాంధీ హైదరాబాద్‌ వస్తున్నారన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రియాంకగాంధీ సభలో డిక్లరేషన్‌ ప్రకటిస్తారని చెబుతున్నారు.

Priyanka Gandhi: ఇవాళ హైదరాబాదులో యువ సంఘర్షణ సభ.. ఫస్ట్‌ టైమ్‌ తెలంగాణకు ప్రియాంక గాంధీ..
Priyanka Gandhi
Follow us on

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న ప్రియాంక గాంధీ.. హైదరాబాద్‌లో తొలి రాజకీయ సభకు హాజరవుతున్నారు. తెలంగాణలోని నిరుద్యోగులకు భరోసా కల్పించడానికే ప్రియాంకగాంధీ హైదరాబాద్‌ వస్తున్నారన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రియాంకగాంధీ సభలో డిక్లరేషన్‌ ప్రకటిస్తారని చెబుతున్నారు. యువ సంఘర్షణ సభ విజయవంతానికి టీకాంగ్రెస్‌ ముమ్మర కసరత్తు చేసింది. అయితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ టూర్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో బేగంపేటకు వస్తారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గాన ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి అర్పిస్తారు. ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ స్టేడియానికి చేరుకుంటారు. సరూర్నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభలో ప్రసంగిస్తారు.

ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు. ప్రియాంక ప్రసంగం 20 నుంచి 25 నిమిషాలపాటు ఉంటుంది. సభ ముగిసిన తర్వాత.. ఢిల్లీకి వెళ్లనున్నారు ప్రియాంక గాంధీ. ప్రియాంకగాంధీకి తెలంగాణలో ఇది తొలి రాజకీయ సభ కావడంతో.. విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులుగా జన సమీకరణ, ఏర్పాట్లపై సమీక్షలు చేస్తోంది.

మధ్యాహ్నం 3.30 గంటలకే ప్రియాంక గాంధీ వస్తుండడంతో.. ఆ సమయం కంటే ముందే జనం సభకు చేరుకునేట్లు చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నాయకులకు స్పష్టం చేశారు. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక.. ఆ రోజు తనకున్న టైట్‌ షెడ్యూల్‌లో అతి తక్కువ సమయం మాత్రమే కేటాయించగలిగారు. ఒక విధంగా ఆమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మొత్తంగా సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంకగాంధీ 45 నుంచి 50 నిమిషాలపాటు గడపనున్నట్లు వెల్లడించాయి.

ప్రియాంక ప్రసంగం 20 నుంచి 25 నిమిషాలపాటు ఉంటుంది. సభ ముగిసిన తర్వాత.. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం