Telangana: ఎమ్మెల్యేల లెటర్‌ల కోసం పరుగులుపెడుతున్న పోలీస్‌ అధికారులు.. ఇంతకీ విషయం ఏమిటంటే..?

| Edited By: Jyothi Gadda

Jul 24, 2023 | 2:54 PM

తమకు నచ్చిన వారికి తమకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పోస్టింగ్స్ వేస్తూ పొలిటికల్ లీడర్లు సిఫారసు లీటర్లు ఇస్తున్నారు... దీంతో రానున్న ఎన్నికల్లో తమకు నచ్చిన వారి కోసమే ఈ పోస్టింగ్ ఇస్తున్నారన్న విమర్శలు అయితే తెలంగాణ పోలీస్ శాఖ ఎదుర్కొంటుంది.

Telangana: ఎమ్మెల్యేల లెటర్‌ల కోసం పరుగులుపెడుతున్న పోలీస్‌ అధికారులు.. ఇంతకీ విషయం ఏమిటంటే..?
Telangana Police
Follow us on

మరొక మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో రానున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా ఇప్పుడు తమ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లు , సబ్ డివిజన్ సంబంధించిన పోస్టింగ్ల విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు …గత కొంతకాలంగా వారం రోజుల వ్యవధిలో తెలంగాణలో జరిగిన డిఎస్పీల పోస్టింగులు పొలిటికల్ పోస్టింగులు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

“వారం లో 175 మంది డీఎస్పీ ల బదిలీ “

వారం రోజుల వ్యవధిలో తెలంగాణ పోలీసు లో 175 మంది డిఎస్పీలకు పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .. ఇంత హడావుడిగా పోస్టింగులు వేయడం వెనకాల అసలు రీజన్ అంత మరొక మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఎన్నికలు రావడంమే… డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుసారంగా ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయకుండా తమకు నచ్చిన వారి పోస్టింగ్స్ కోసం ఇప్పటినుంచే ప్రజాప్రతినిధులు లెటర్లు ఇస్తున్నారు …దాదాపు తెలంగాణలో ఉన్న అన్ని సబ్ డివిజన్లకు సంబంధించి అన్ని డివిజన్లకు డీఎస్పీలు అంతా కూడా పోస్టింగులు మారిపోయాయి …ఈ 175 మంది బదిలీల్లో ఎక్కువ శాతం అనేక నియోజకవర్గాలకు చెందినటువంటి పోస్టింగ్ లిస్టు డిజిపి ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ కూడా పొలిటికల్ పోస్టింగ్ అనే విమర్శలు వస్తున్నాయి.

“ఎంఎల్ఏ సిఫార్సు లెటర్ ఉంటేనే పోస్టింగ్ “

ఎమ్మెల్యే కన్సన్ లెటర్ ఇస్తేనే పోస్టింగులు ఉన్నాయి..అంటూ పెద్ద ఎత్తున వివాదం ఒకవైపు నడుస్తున్న సమయంలోనే డిఎస్పి లకు పెద్ద ఎత్తున పోస్టింగ్స్ వచ్చాయి …జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రుల సిఫార్సు లెటర్స్ తో చాలా మంది పోస్టింగ్‌లు తీసుకుంటున్నారు… మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమకు వచ్చిన వారిని పోస్టింగ్ చేసుకుంటే ఎన్నికల సమయంలో తమకు నచ్చినట్టుగా తాము చెప్పినట్టుగా వింటారనే ఒక ఆశతో ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వారికి, తమకు దగ్గర వారికి, తాము ఏ పని చెప్పినా చేస్తామని చెప్పుకునే వారికి ఈ సిఫారసు లేఖలు ఇచ్చి పోస్టింగ్స్ కోసం ట్రై చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆరునెలలుగా ఖాళీ గా జూబ్లీహిల్స్ ఏసిపి పోస్టింగ్..

తాజాగా హైదరాబాదులో నెలకొన్న జూబ్లీహిల్స్ ఏసిపి వివాదం కూడా అదే రకంగా ఉంది..తెలంగాణ కొత్త పోలీస్ స్టేషన్లో, కొత్త సబ్ డివిజన్లో ఏర్పాటు జరిగిన తర్వాత జూబ్లీ హిల్స్ ఏసిపి గా సుబ్బన్నకు అవకాశం ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు …కానీ లోకల్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన సిఫారసు లేకుండా వచ్చినటువంటి సుబ్బన్న ను జాయిన్ కాకుండా అడ్డుకున్నారు… ఆ తర్వాత తన కన్సన్ లెటర్ తో వచ్చినటువంటి హరిప్రసాద్ కి పోస్టింగ్ ఇప్పించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో డిఎస్పీలో పోస్టింగ్ వివాదం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. తమకు నచ్చిన వారికి తమకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పోస్టింగ్స్ వేస్తూ పొలిటికల్ లీడర్లు సిఫారసు లీటర్లు ఇస్తున్నారు… దీంతో రానున్న ఎన్నికల్లో తమకు నచ్చిన వారి కోసమే ఈ పోస్టింగ్ ఇస్తున్నారన్న విమర్శలు అయితే తెలంగాణ పోలీస్ శాఖ ఎదుర్కొంటుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..