TCongress: ‘రాహుల్ సభను అడ్డుకునే కుట్ర, వాహనాలు సీజన్ చేస్తున్నారు ’.. బీఆర్ఎస్ నేతలపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు..

|

Jul 02, 2023 | 11:01 AM

Ponguleti Srinivas Reddy: ఖమ్మం వేదికగా జరుగుతున్న కాంగ్రెస్‌ సభ జిల్లా రాజకీయాల్లో హీట్ పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరనుండడం, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగియనుండడంతో..

TCongress: ‘రాహుల్ సభను అడ్డుకునే కుట్ర, వాహనాలు సీజన్ చేస్తున్నారు ’.. బీఆర్ఎస్ నేతలపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు..
Ponguleti Srinivas Reddy
Follow us on

Ponguleti Srinivas Reddy: ఖమ్మం వేదికగా జరుగుతున్న కాంగ్రెస్‌ సభ జిల్లా రాజకీయాల్లో హీట్ పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరనుండడం, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగియనుండడంతో ‘జన గర్జన’ పేరుతో హస్తం నేతలు ఖమ్మంలో సభను ఏర్పాటు చేశారు. అయితే సభను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ మాజీ ఎంపీ పొంగులేటి అధికార బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘మా సభను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కనుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో రోడ్లను మూసివేయిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తల్ని భయబ్రాంతులకి గురిచేస్తున్నారు. ఇప్పటికే 1700 వాహనాలను సీజ్ చేశారు. ఇంకా సభను ఫెయిల్ చేయాలని చూస్తున్నారు. వారు అధికార దాహంతో వ్యవహరిస్తున్నారు. జన గర్జన సభతోనే బీఆర్ఎస్ పార్టీ పతనం మొదలవుతుంది. అవసరమైతే నేను రోడ్డు మీదకు వస్తా’ అని అన్నారు.


ఇదిలా ఉండగా.. ఖమ్మంలో జరిగే ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు నేరుగా ఖమ్మంలో కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం సభలో ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. ఇంకా రాబోయే ఎన్నికల కోసం ఈ సభ నుంచే రాహుల్ సమర శంఖం పూర్తిస్తారు.  మరోవైపు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే చేసేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..