Telangana: మేడిగడ్డ vs పాలమూరు.. ప్రాజెక్ట్‌ల గట్టు మీద తెలంగాణ రాజకీయం.. పోటాపోటీ పర్యటనలు..

బీఆర్ఎస్.. ఛలో మేడిగడ్డ, కాంగ్రెస్ ఛలో పాలమూరు.. ఇలా.. ప్రాజెక్ట్ వార్ తెలంగాణలో మళ్లీ కాకరేపుతోంది. ఇవాళ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో మేడిగడ్డ.. పాలమూరు ప్రాజెక్టులపై పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. ఇవాళ బీఆర్‌ఎస్‌ నేతలు మేడిగడ్డ, అన్నారంలో పర్యటించనున్నారు. అన్నారం బ్యారేజీ దగ్గర బీఆర్‌ఎస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది.

Telangana: మేడిగడ్డ vs పాలమూరు.. ప్రాజెక్ట్‌ల గట్టు మీద తెలంగాణ రాజకీయం.. పోటాపోటీ పర్యటనలు..
KTR - Revanth Reddy

Updated on: Mar 01, 2024 | 11:49 AM

బీఆర్ఎస్.. ఛలో మేడిగడ్డ, కాంగ్రెస్ ఛలో పాలమూరు.. ఇలా.. ప్రాజెక్ట్ వార్ తెలంగాణలో మళ్లీ కాకరేపుతోంది. ఇవాళ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో మేడిగడ్డ.. పాలమూరు ప్రాజెక్టులపై పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. ఇవాళ బీఆర్‌ఎస్‌ నేతలు మేడిగడ్డ, అన్నారంలో పర్యటించనున్నారు. అన్నారం బ్యారేజీ దగ్గర బీఆర్‌ఎస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. అయితే, బీఆర్‌ఎస్‌ మేడిగడ్డ టూర్‌కి కౌంటర్‌గా కాంగ్రెస్‌ పాలమూరులో పర్యటించనుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ నేతలు పరిశీలించనున్నారు. గత పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డిపై నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్‌ ఎత్తిచూపనుంది. ఈ పర్యటనలపై ఇరు పార్టీలనేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగాయి.

కాగా.. కొద్ది రోజుల క్రితం మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన మంత్రుల బృందం.. కుంగిన పిల్లర్లను చూపించింది. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే మేడిగడ్డ కుంగిపోయిందంటూ.. ప్రాజెక్ట్ దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి.. ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఇదీ అంటూ మీడియా ముఖంగా ప్రభుత్వం వివరించింది.

అయితే, తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు.. చలో మేడిగడ్డకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఒక్క పిల్లర్ కుంగితే ప్రాజెక్టే పనికి రాదంటూ కాంగ్రెస్ ఆరోపించడం ఎంతవరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తోన్న గులాబీ పార్టీ.. ఈ క్రమంలోనే శుక్రవారం మేడిగడ్డ దగ్గరకు వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

బీఆర్‌ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్‌గా పాలమూరు బాట పట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. ప్రాజెక్ట్‌ల స్థితిగతులను వివరించేలా కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంది.

మేడిగడ్డకు కౌంటర్‌గా పాలమూరు నినాదం ఎత్తుకోవడంపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. విషయాన్ని డైవర్ట్ చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందనేది బీఆర్‌ఎస్ ఆరోపణ.

దొంగే దొంగ అన్నట్టు బీఆర్‌ఎస్ వ్యవహరిస్తోంది. చేసిన తప్పు ఒప్పుకోవాల్సింది పోయి.. ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ మండిపడుతోంది.

మొత్తంగా అటు మేడిగడ్డకు బీఆర్‌ఎస్.. ఇటు పాలమూరుకు కాంగ్రెస్. ఈ రెండు పార్టీల పోటా పోటీ పర్యటలు తెలంగాణలో కాకరేపుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..