
హైదరాబాద్ మహానగరం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడిని ఉప్పల్ కళ్యాణపురికి చెందిన పెయింటర్ మురళీకృష్ణగా గుర్తించారు. మురళీకృష్ణ కూలీ పనులు చేస్తుండగా, ఆయన భార్య అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తోంది. తనకు జరిగి విషయాన్ని స్థానికులతో చెప్పి పెయింటర్ మురళీకృష్ణ చనిపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఉప్పల్ కల్యాణపురికి చెందిన పెయింటర్ మురళీకృష్ణ, కూలీ పని కోసం ఎల్బీనగర్ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వరకు లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ ఇస్తామని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు కారు డ్రైవర్. కారు డ్రైవర్‌కు అతని నలుగురు స్నేహితులు జత కలిశారు. పెయింటర్‌ను నాచారం పారిశ్రామిక వాడ ప్రాంతంలోకి తీసుకెళ్లి నలుగురు కలిసి అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. NGRI వద్దకు వచ్చాక బాధితుడు కారులో నుంచి దూకేశాడు.
అనంతరం మురళీకృష్ణను వెంటాడిన నలుగురు యువకులు కత్తితో 8సార్లు పొడిచారు. వారి నుంచి రోడ్డుపై తప్పించుకుని పరిగెత్తుతూ వెళ్లి పడిపోయాడు. అయితే అతను చనిపోయాడనుకున్న నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతని గమనించిన స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించారు. కాగా, తనకు జరిగి విషయాన్ని స్థానికులతో చెప్పిన పెయింటర్ మురళీకృష్ణ ప్రాణాలు విడిచాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈ కేసులో దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాచారం రాఘవేంద్రనగర్‌కు చెందిన మహమ్మద్ జునైద్ అలియాస్ జాఫర్, ఇందిరానగర్ వాసి షేక్ సైఫుద్దీన్, కార్తికేయనగర్‌లో ఉండే పొన్నా మణికంఠ, మల్లాపూర్‌కు చెందిన మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..