Telangana: ఏందీ సామీ మాకీ తిప్పలు.. పోలీస్ స్టేషన్ లో గోవులను పెంచుతున్న పోలీసులు..!

| Edited By: Balaraju Goud

Oct 29, 2024 | 4:27 PM

పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆ పశువులను పెట్టారు. అయితే వాటికి సమయానికి గడ్డి, దాణా, నీరు పెట్టలేక నానా ఇబ్బందులు పడుతూ కాపలాగా ఉన్నారు పోలీసులు.

Telangana: ఏందీ సామీ మాకీ తిప్పలు.. పోలీస్ స్టేషన్ లో గోవులను పెంచుతున్న పోలీసులు..!
Cows In Police Station
Follow us on

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గోదావరిలో పశువులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన రహదారుల గుండా ఏదో ఒక వాహనంలో పశువులు అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లు. అయితే వీరికి చెక్ పెట్టడానికి చెక్‌పోస్టు లు ఏర్పాటు చేశారు పోలీసులు. అక్రమ రవాణా పై నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. దీంతో కేటుగాళ్లు రూట్ మార్చారు.

పశువుల అక్రమరవాణాకు రవాణా మార్గంలో పోలీసుల చెక్ పోస్టుల పసిగట్టిన పశువుల అక్రమ రవాణదారులు ఏకంగా గోదావరి నదినీ ఉపయోగించుకంటున్నారు. గోదావరి దాటిస్తుండగా పోలీసులు వారి ఎత్తును చిత్తు చేసి చెక్ పెట్టారు. మాటు వేసి 34 పశువులతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. ఇపుడు ఇక్కడ పోలీసులకు కొత్త సమస్య వచ్చింది.

పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆ పశువులను పెట్టారు. అయితే వాటికి సమయానికి గడ్డి, దాణా, నీరు పెట్టలేక నానా ఇబ్బందులు పడుతూ కాపలాగా ఉన్నారు పోలీసులు. ఇదిలాఉండగా వాటి ఆరోగ్య పరిస్థితి కోసం వెటర్నరీ వైద్యురాలిని ఏర్పాటు చేశారు. పశువులను పరిశీలించి వాటి వయసుతో పాటు లింగ నిర్ధారణ చేసి పంచనామా నిర్వహించిన అనంతరం గోశాలకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. దొంగలను అయితే పట్టుకున్నాం.. కానీ వీటి బాగోగులు ఎలా చూస్తాం.. అంత సమయం ఎక్కడ ఉందని.. మాకు ఇదేమి ఖర్మరా బాబూ అంటూ పోలీసులు తలలు పట్టుకుంటున్నారట..!

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..