హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సందడి వాతావరణం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేతలంతా భాగ్యనగరానికి తరలివస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు హైదరాబాద్ రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత శంషాబాద్‌లో ల్యాండ్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజ్‌కృష్ణ హోటల్ కేంద్రంగా జరగనున్న ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రానికే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈ సమావేశాలు జరిగుతున్న తాజ్ కృష్ణ హోటల్‌తో సహా దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. శుక్రవారం నుంచే కొంతమంది ప్రముఖులు రావడంతో.. అటు శంషాబాద్ విమానాశ్రయంతో సహా తాజ్ కృష్ణ హోటల్ పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించారు.
మరోవైపు శాంతిభద్రతల విభాగంతో సహా నగర భద్రత విభాగం, ట్రాఫిక్ వింగ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అందరు కిలిసి ఉమ్మడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే తాజ్ హోటల్‌లోని బస చేసి ఉన్న వారి జాబితాలను పోలీసులు సేకరించారు. ప్రస్తుతం వాటిని విశ్లేషిస్తున్నారు. అలాగే అక్కడ రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రోజున శంషాబాద్ విమానాశ్రయంలో జరిగినటువంటి గలాభా నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజ్ కృష్ణ హోటల్‌తో సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో కేవలం అధీకృత వ్యక్తులను మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ప్రతిరోజూ.. మూడు నాలుగు సార్లు బాంబు స్క్వాడ్ బృందాలు, స్నిఫర్ డాగ్స్ తనిఖీలు చేయనున్నారు. ఇద్దరు డీసీపీ అధికారుల నేతృత్వంలో మరో ఇద్దరు అదనపు డీసీపీలు, 4గురు ఏసీపీలు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు, 25 మంది సబ్–ఇన్‌స్పెక్టర్లు, పదమూడు మంది ఎస్సైలు, 110 మంది ప్లటూన్ల సాయుధ బలగాలు ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు.
అంతేకాదు వీళ్లలో మహిళా అధికారులు, సిబ్బంది కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలను రానున్న సందర్భంగా.. ఇప్పటికే తాజ్‌కృష్ణ హోటల్‌కు వెళ్లే మార్గాలను అలంకరించారు. భారీ కటౌట్లు, జెండాలు, ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శని, ఆదివారాల్లో ఈ భేటీ జరగనుంది. ఇక పార్టీ అగ్రనేతలు హైదరాబాద్‌కి రానున్న నేపథ్యంలో నగరానికి రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. మరోవైపు నగర శివారు తుక్కుగూడ వేదికగా జరిగే విజయభేరి సభకు నగర శివారు ప్రాంతాలు కూడా ముస్తాబవుతున్నాయి. ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా జనాల్ని తీసుకొచ్చేలా పార్టీ నేతలు కసరత్తులు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..