Hyderabad: హైదరాబాద్‌లో డీజే మోతలపై పోలీసుల ఫోకస్‌.. మతపరమైన ర్యాలీల్లో డీజే బ్యాన్..?

హైదరాబాద్‌లో డీజేల వ్యవహారంపై అన్నివర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలతోపాటు మత పెద్దల నుంచి కూడా ఫిర్యాదులు అందడంతో హైదరాబాద్‌ పోలీసులు అలెర్ట్‌ అయ్యారు.

Hyderabad: హైదరాబాద్‌లో డీజే మోతలపై పోలీసుల ఫోకస్‌.. మతపరమైన ర్యాలీల్లో డీజే బ్యాన్..?
Hyderabad Cp Cv Anand (file)
Follow us

|

Updated on: Sep 26, 2024 | 4:47 PM

హైదరాబాద్‌లో డీజేల వ్యవహారంపై అన్నివర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలతోపాటు మత పెద్దల నుంచి కూడా ఫిర్యాదులు అందడంతో హైదరాబాద్‌ పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌ వేదికగా డీజేలపై హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో డీజేల వ్యవహారం ఈ ఏడాది మరింత శృతిమించిందన్నారు సీపీ సీవీ ఆనంద్. గణేష్‌ నిమజ్జనం, మిలాద్‌ ర్యాలీల్లో డీజేలు హోరెత్తించడంతో అన్ని వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అందరి అభిప్రాయాలతో డీజేలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు సీపీ సీవీ ఆనంద్‌.

ఇదిలావుంటే, పలు ర్యాలీల్లో విపరీతమైన డీజే సౌంట్లు, టపాసుల వాడకం పెరిగిన నేపథ్యంలో అన్నివర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై సీపీ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌లో ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు లౌడ్‌స్పీకర్స్‌ల వినియోగాన్ని గతంలోనే నిషేధించారు.

ఇక.. DJల విషయంలోనూ నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. నివాస ప్రాంతాల్లో పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్‌కి సౌండ్ మించకూడదు.. కమర్షియల్ ఏరియాల్లో పగలు 65 డెసిబెల్స్, రాత్రి 55 డెసిబెల్స్ వరకే సౌండ్‌కి పరిమితి ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో పగలు 75 డెసిబెల్స్, రాత్రి 70 డెసిబెల్స్‌కి లిమిట్ చేస్తూ నిబంధనలున్నాయి. ఇక స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రుల ఉన్న ప్లేస్‌లైతే పూర్తిగా సైలెంట్ జోన్స్‌. కానీ వీటిని పట్టించుకోకుండా DJలు హోరెత్తుతున్నాయి. అందుకే వీటిని కంట్రోల్ చేయడం ఎలాగనే దానిపై రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌లో చర్చించారు. వివిధ వర్గాల అభిప్రాయలను సేకరించిన హైదరాబాద్ పోలీసులు పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..