AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాకీ డ్రెస్ ఒంటి మీద ఉందని రెచ్చిపోయిన కానిస్టేబుల్.. వృద్ధుడిపై విచక్షణారహిత దాడి..!

వికారాబాద్‌లో కానిస్టేబుల్ గణేష్ ఓ వృద్ధుడు అనంతయ్యపై సైకిల్ పార్కింగ్ వివాదంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఖాకీ డ్రెస్ అండతో రెచ్చిపోయిన కానిస్టేబుల్ చర్య తీవ్ర చర్చకు దారితీసింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడికి న్యాయం జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఖాకీ డ్రెస్ ఒంటి మీద ఉందని రెచ్చిపోయిన కానిస్టేబుల్.. వృద్ధుడిపై విచక్షణారహిత దాడి..!
Constable Assault Elderly Man
Balaraju Goud
|

Updated on: Sep 11, 2026 | 5:02 PM

Share

వికారాబాద్: వృద్ధుడిపై ఓ పోలీసులు కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన వికారాబాద్‌లో కలకలం రేపుతున్నాయి. ఎంఐజీ కాలనీలో సైకిల్ నిలిపిన విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. తనపై కానిస్టేబుల్ దాడి చేశాడంటూ బాధిత వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఎంఐజీ కాలనీలో నివసించే అనంతయ్య అనే వృద్ధుడు ఓ ఇంటి ముందు తన సైకిల్‌ను నిలిపాడు. అయితే ఆ ఇంటి ముందు నుంచి సైకిల్‌ను తొలగించాలని కానిస్టేబుల్ గణేష్ తల్లి అనంతయ్యతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తనతో వృద్ధుడు గొడవపడుతున్నాడంటూ గణేష్ తల్లికి తన కుమారుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గణేష్.. అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత అతనిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

విచక్షణ కోల్పోయి దాడి చేశాడా?

దీంతో బాధితుడు న్యాయం చేయాలంటూ.. పోలీసులను ఆశ్రయించాడు. కానిస్టేబుల్ తనపై తీవ్రంగా దాడి చేయడంతో శరీరంపై గాయాలయ్యాయని అనంతయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అనంతరం వికారాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపైనే ఇలాంటి ఆరోపణలు రావడంతో ఘటన చర్చనీయాంశంగా మారింది. బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, కేసు నమోదు విషయంలో పోలీసులు ఆలస్యం చేస్తున్నారంటూ బాధితుడి వర్గం ఆరోపిస్తోంది. బాధితుడి ఫిర్యాదు, వైద్య పరీక్షలు, సీసీటీవీ, ఇతర ఆధారాల ఆధారంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us