చేపలు వీరికి విషంతో సమానం.. తింటే ఎంత ప్రాబ్లమూ తెలుసా?

samatha

11 september 2026

Pic credit - Pinterest

చేపలు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా చేపలు తింటూ ఉంటారు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

అందువలన చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ప్రతి ఒక్కరూ వీటిని చాలా ఇష్టంగా తింటుంటారు.

చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ కొంత మంది వీటిని అస్సలే తినకూడదు అంటున్నారు నిపుణులు. కాగా, వారు ఎవరో చూద్దాం.

ఎవరు అయితే అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారో, వారు తప్పకుండా చేపలు తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అంతే కాకుండా చేపల్లో ప్యూరిన్ ఎక్కువ ఉంటుంది. అందువలన యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నావారు తినడం వలన యూరిక్ యాసిడ్ పెరిగి కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి.

అంతే కాకుండా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా మెర్క్యురీ ఎక్కువగా ఉండే చేపలు అయిన సొర, ట్యూనా , కింగ్ మాకెరెలా వంటివి తినకూడదు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని చాలా తక్కువగా తినాలి, చేపల్లో పొటాషియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది.

అలాగే రక్తం పలచబడే మందులు వాడే వారు కూడా వీలైనంత వరకు  చేపలు తినడం మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.