Hyderabad Crime News: ఇంట్లో చోరికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లో పట్టించిన నిఘానేత్రం.. ఎలాగంటే..

ఏదైనా పనిమీద ఇంటిల్లిపాది బయటకు వెళ్తే.. ఇదే అదనుగా దొంగలు మాటువేసి ఉంటారు. ఇంట్లో చొరబడి కష్టపడి సంపాదించుకున్న సొత్తును ఎత్తుకెళ్తారు. ఐతే ఓ వ్యక్తి తెలివిగా చేసిన పనితో తన ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తిని 24 గంటలు గడవక ముందే కటకటాలపాలు..

Hyderabad Crime News: ఇంట్లో చోరికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లో పట్టించిన నిఘానేత్రం.. ఎలాగంటే..
Robbery In House
Follow us

|

Updated on: Sep 12, 2022 | 8:41 PM

Telangana Crime News: ఏదైనా పనిమీద ఇంటిల్లిపాది బయటకు వెళ్తే.. ఇదే అదనుగా దొంగలు మాటువేసి ఉంటారు. ఇంట్లో చొరబడి కష్టపడి సంపాదించుకున్న సొత్తును ఎత్తుకెళ్తారు. ఐతే ఓ వ్యక్తి తెలివిగా చేసిన పనితో తన ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తిని 24 గంటలు గడవక ముందే కటకటాలపాలు అయ్యేలా చేశాడు. వివరాల్లోకెళ్తే..

వివరాల్లోకెళ్తే.. మొయినాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో రూ.3 వేల చిన్న కెమెరాను కొని ఇంటి ఆవరణ (హాల్లో) ఉంచాడు. ఈ చిన్న కెమెరాకు వైఫైని కనెక్ట్‌ చేసి తన ఫోన్‌లో నిత్యం దృశ్యాలు కనిపించేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఐతే తాజాగా పనిమీద ఇంటికి తాళం వేసి సదరు వ్యక్తి కూకట్‌పల్లికి వెళ్లాడు. ఇంట్లో ఎవ్వరూ లేరని గమనించిన ఓ దొంగ చొరబడి సీసీ కెమెరాలు, వాటి డీవీఆర్‌లతోపాటు, నగదు, ఇతర సామాగ్రిని దోచుకెళ్లాడు. కూకట్‌పల్లిలో ఉన్న యజమాని తన ఫోన్‌లో చూసుకోగా చిన్న కెమెరా ఫుటేజ్‌ కట్‌ అయినట్లు గ్రహించాడు. వెంటనే అనుమానంతో తన ఇంటి సమీపంలో ఉండే వ్యక్తిని వెళ్లి చూడమన్నాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నట్లు యజమానికి ఫోన్‌లో చెప్పాడు. ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో వస్తువులు కిందపడి ఉండడం చూసి విషయం తెలియజేశాడు. దీంతో యజమాని తన ఫోన్‌లో అప్పటివరకు రికార్డయిన చిన్న కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా దొంగతనం బయటపడింది. తన ఫోన్‌లోని చిన్న కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు. కేవలం రూ.3 వేల కెమెరా సాయంతో ఇదంతా సాధ్యపడింది. ఇలాంటి కెమెరాలను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు ఏర్పాటుచేసుకుంటే ఇళ్లకు భద్రత కల్పించుకోవచ్చని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ శశాంక్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

Latest Articles
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యులు
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..
ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యట
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యట