హైదరాబాద్, మార్చి 24: స్మగ్లింగ్‌లో పుష్పను మించి పోయాడు ఓ ప్రబుద్ధుడు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను సరఫరాకు ఏకంగా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను ఉపయోగించాడు. వాడి తెలివితేటలు చూసి పోలీసులే కళ్లు తేలేశారు. డ్రగ్స్ వినియోగంపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. అందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి మత్తుపదార్థాల అక్రమ రవాణాపై పటిష్ట నిషా ఏర్పాటు చేశారు. అయినా కొందరు కేటుగాళ్లు అతి తెలివితేటలతో గుట్టుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. తాజాగా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ మాదిరిగా ఉండే కిట్స్‌లో డ్రగ్స్ తరలిస్తూ ఓ వ్యక్తి హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. డీసీపీ చైతన్య తెలిపిన వివరాల ప్రకారం..
మంగళ్‌హాట్‌కు చెందిన గోస్వామి ఆశిష్ గిర్ (24) అనే వ్యక్తి బట్టల దుకాణంలో పనిచేసేవాడు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ రెండేళ్ల క్రితం పోలీసులకు పట్టుబడ్డాడు. అలా చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించాడు. జైలులో ఉన్నప్పుడు ఆశిష్‌కి ఒడిశాకు చెందిన డ్రగ్ పెడ్లర్ మిలన్ దేబంత్‌తో, ముంబైకి చెందిన మరో డ్రగ్ డీలర్‌తో పరిచయమైంది. బయటకు వచ్చాక మిలన్ నుంచి గంజాయిని కిలో రూ.8 వేలకు కొని రూ.15 వేలకు విక్రయించేవాడు. ముంబయికి చెందిన డీలనఖ నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను గ్రాము రూ.1500 కొని రూ.4 వేలకు అమ్మేవాడు. ఈ క్రమంలో అతడు డ్రగ్స్‌తో వాహనంలో వస్తున్నట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు పక్కా సమాచారం అందింది. మార్చి 22 ఉప్పుగూడ జెండా ప్రాంతంలో ఛత్రినాక పోలీసులు నిఘా ఉంచారు.
#WATCH | Telangana: DCP, South Zone Hyderabad, Sai Chaitanya says, “Today Chatrinaka police cracked a case of drugs supplier by name Ashish…He was a drug dealer earlier also he was in the drug business… A case was listed in Mangalhat Police Station and after that, he was kept… pic.twitter.com/1tBngw7BTV
— ANI (@ANI) March 24, 2024
అటుగా కారులోవచ్చిన ఆశిష్ కారును ఆపిన పోలీసులు తనిఖీలు చేయడంతో కారు డిక్కీలో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు ఉన్నాయి. మొదట అర్ధం కాలేదు పోలీసులకు… ఆతర్వాత డిక్షనరీలు ఓపెన్ చెయ్యగా.. అసలు యవ్వారం బయటికి వచ్చింది. దాదపు 6.225 కిలోగ్రాముల గంజాయి, 18.75 గ్రాముల MDME డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3.81 లక్షలు ఉంటుందని డీసీపీ చైతన్య తెలిపాడు. అనంతరం పట్టుబడ్డ డ్రగ్స్‌ను సీజ్ చేసి, నిందితుడు ఆశిష్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచామని, ఆ తర్వాత జైలుకు తరలించినట్లు ఆయన మీడియాకు వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.