
వరంగల్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో మోదీ తెలంగాణకు రానున్నారు. ఉదయం 9.25 గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాట చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ నేతలు మొదలు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ప్రస్తుతం వారణాసిలో ఉన్న ప్రధాని మోదీ.. ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌లోని మామునూరు చేరుకుంటారు. మొదట భద్రకాళి దేవాలయానికి వెళ్లనున్న ప్రధాని అక్కడ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో మైదానంలో బహిరంసభలో పాల్గొంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని సభా వేదిక నుంచే శంకుస్థాపన చేస్తారు. తర్వాత సభలో ప్రసంగించనున్న మోదీ.. మధ్యాహ్నం 12.20 తర్వాత హెలికాప్టర్‌లో హకీంపేట్ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్ వెళ్లనున్నారు.
ఇదిలా ఉంటే ప్రధానీ మోదీ పర్యటనకు తాము దూరంగా ఉంటున్నట్లు బీఆర్‌ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. మోదీ సభను తాము బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వరంగల్ చుట్టూ 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..