Telangana: సిరిసిల్ల కళాకారుడి అరుదైన గౌరవం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు.. రాజ్ భవన్ నుంచి పిలుపు..

PM Modi on Mann Ki Baat: నేత కళాకారుడికి అరుదైన గౌరవం దక్కింది. మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ అభినందనలు పొందిన హరి ప్రసాద్.. ఇప్పుడు రాజభవన్ నుంచి పిలుపు వచ్చింది.

Telangana: సిరిసిల్ల కళాకారుడి అరుదైన గౌరవం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు.. రాజ్ భవన్ నుంచి పిలుపు..
Mann Ki Baat Pm Modi

Updated on: Apr 28, 2023 | 6:05 AM

Hari Prasad: సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. చేనేత మగ్గంపై పలు ఆవిష్కరణలు చేయడంతో పాటు జి20 లోగోని నేసినందుకు ప్రధాని మోదీ నుంచి అభినందనలు పొందారు హరిప్రసాద్. ఇప్పుడు తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళి సై నుంచి రాజభవన్ రావాలని మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రత్యేక స్క్రీనింగ్ నుండి వీక్షించాలని కబురందింది. ఈమేరకు రాజ్ భవన్ నుండి లెటర్ పంపారు. దీంతో తన ప్రతిభ గుర్తించిన ప్రధానమంత్రి మోడీ, గవర్నర్ తమిళ్ సై, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హరి ప్రసాద్.

గతంలో చేనేత మగ్గం పై అనేక ప్రయోగాలు చేశాడు హరిప్రాసాద్. బుల్లి మరమగ్గాలు, అగ్గిపెట్టలో ఇమిడే వెండి చీర, దబ్బనం సూదిలో దూరే చీరలు, కెసిఆర్, కేటీఆర్, ముఖచిత్రాలు, ఆజాద్ కి అమృతం మహోత్సవం సందర్భంగా జాతీయ గీతం, భారతదేశ ముఖచిత్రం ఒకే వస్త్రం పై వచ్చే విధంగా నేశారు. అలాగే మహాత్మా గాంధీజీ 150వ పుట్టినరోజుకు గాంధీజీ నూలు వాడుతున్న విధానం, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటో తో నేసిన వస్త్రం, రాజన్న సిరిపట్టు నామ కరణం చేశారు.

ఇవి కూడా చదవండి

పట్టు పితాంబరం చీరను నేసి భద్రాచలం శ్రీ సీతారామల వారి కల్యాణం కూడా పట్టుచీరను దేవాదాయ ధర్మాదాయ శాఖ అందించాను. వీటిని దేశ, విదేశాలకు పంపిస్తూ అక్కడి నుండి కూడా ఆర్డర్లు స్వీకరిస్తూ పలు రకాల పట్టు చీరలను నేస్తున్నారు. జి20 సదస్సు జరిగినప్పుడు జి20 లోగోను చేనేత మగ్గం పై నేసి ప్రధానికి పంపించడం ద్వారా ప్రధాని మోదీ ద్వారా అభినందనలు పొందారు హరిప్రసాద్.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..