Telangana: పెంపుడు శునకానికి సమాధి.. డప్పు వాయిద్యాలతో అంతిమ సంస్కారం. వైరల్‌ వీడియో

|

Jul 15, 2023 | 3:56 PM

పెంపుడు కుక్క చనిపోతే ఆ శునకంతో ఉన్న జ్ఞాపకాన్ని మర్చిపోలేక సమాధి నిర్మించాడు ఓ యజమాని. డప్పు వాయిద్యాలతో శునకాకిని అంతిమ సంస్కారం నిర్వహించాడు. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పది సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకం. ఆ ఇంట్లో ఒకరిగా మెదిలిన పెంపుడు కుక్క ఆకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ జ్ఞాపకాలను...

పెంపుడు కుక్క చనిపోతే ఆ శునకంతో ఉన్న జ్ఞాపకాన్ని మర్చిపోలేక సమాధి నిర్మించాడు ఓ యజమాని. డప్పు వాయిద్యాలతో శునకాకిని అంతిమ సంస్కారం నిర్వహించాడు. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పది సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకం. ఆ ఇంట్లో ఒకరిగా మెదిలిన పెంపుడు కుక్క ఆకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ జ్ఞాపకాలను మరిచిపోలేక సమాధి కట్టించాడు యాజమాని.

ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ళపూసపెల్లి గ్రామంలో జరిగింది. రాచర్ల వీరన్న అనేవ్యక్తి తన ఇంట్లో పది సంవత్సరాలుగా ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాడు. ఇటీవల ఆ పెంపుడు కుక్క అనారోగ్యం బారిన పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ కుక్క మరణించింది. ఏళ్లుగా ఇంట్లో ఒకరిగా మెదిలిన ఆ శునకం మరణించడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు.

మృతి చెందిన శునకం జ్ఞాపకాలను మర్చిపోలేక పోయారు. ఆ శునకాన్ని స్మరించుకుంటూ తనకున్న వ్యవసాయ భూమిలో సమాధి కట్టించారు. పరలోకంలో ఈ శునకం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కుక్కకు సమాధి నిర్మించిన విషయం ఊరంతా తెలియడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..