
ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంతలో కొడుకుకి గుండెపోటు వచ్చి.. మృతి చెందాడు.. అయితే.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి కూడా అదే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు.. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామంలో జరిగింది.. తండ్రి కొడుకు గంట వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నాగెపల్లి గ్రామానికి చెందిన ఎరుకల శ్రీకాంత్ గుండెపోటు తో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరు..మున్నీరుగా విలపించారు. తండ్రి కొడుకు చనిపోయిన బాధను ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు ఈ క్రమంలో గంట వ్యవధిలో తండ్రి ఎరుకల రాజేశం కూడా మృతి చెందాడు. దీంతో.. తండ్రీకొడుకు గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోయారు.. గుండెలవిసేలా రోదించారు..
గంట వ్యవధిలో.. తండ్రికొడుకు చనిపోవడంతో.. ఇద్దరికీ కలిపి అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువై సంవత్సరాల క్రితం ఇదే కుటుంబంలో.. రాజేశం తల్లిదండ్రులు ఓకే రోజు మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. మొత్తానికి..ఈ కుటుంబం ఇలాంటి బాధల నుంచి బయటపడటం లేదని పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..