Telangana: కొంతమంది తమ వద్ద ఎంత సంపద ఉన్నా పిల్లికి కూడా బిచ్చం బెట్టరు. ఎంగిలి చేతితో కాకిని కూడా వెళ్లగొట్టరు. ఎవరన్నా పది రూపాయలు ఇచ్చేదుంటే.. వంద రూపాయలు పెట్టి అయినా వసూలు చేస్తారు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ అవ్వను చూడాల్సిందే. నిజంగా ఈ అవ్వ చేసిన పని చూస్తే.. మీరు కూడా చేత్తులెత్తి మొక్కుతారు.
దానం చేసేందుకు గొప్ప ధనవంతులే కానవసరం లేదు. గొప్ప మనసుండాలే కానీ, పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఈ అవ్వ. ఇళ్లు ఇళ్లు భిక్షాటన చేసుకుంటూ బతుకుతుంది. పేరుకు పేదదే అయినా పెద్ద మనసు చేసుకుని. తోటి యాచకులకు అన్నదానం చేసింది. ముప్పై మందికి కడుపునిండా అన్నం పెట్టి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఈ అవ్వ.
వివరాల్లోకెళితే.. ఈ అవ్వది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్. ఈమె పేరు లక్ష్మీ. సుల్తానాబాద్‌లో ఉన్న వేణుగోపాలస్వామి గుడి మెట్లమీద రోజూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే, రోజూ గుడివద్ద ఉండే ఈ అవ్వ.. అక్కడ జరిగే పూజలు, అన్నదానాలు చూసింది. తాను కూడా అన్నదానం చేయాలని తలించింది. తాను దాచుకున్న రెండు వేల రూపాయలను ఖర్చు పెట్టి అన్నదానం చేసింది. ఆమెతో పాటు రోజూ గుడి వద్దే అడుక్కునే తోటి యాచకులు ముప్పై మందికి కడుపు నిండా అన్నం పెట్టించింది. ఈ విషయం తెలిసిన ప్రజలు లక్ష్మి పెద్ద మనసుకు ఫిదా అయిపోతున్నారు. అమెకు అభినందనలు తెలుపుతున్నారు.
Video:
Also read:
Taj Mahal: పండు వెన్నెల్లో పాలరాతి అపురూపం.. రాత్రి సమయాల్లో తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్
Raksha Bandhan 2021: అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తు రాఖీ పండుగ.. స్పెషల్ మెహందీ డిజైన్స్