Patancheru Politics: ఒకే పార్టీలో ఉన్నా.. వేరువేరుగా ప్రయాణం.. మహిపాల్ రాకతో మరీ ఇంట్రస్టింగ్!

|

Jul 16, 2024 | 8:59 AM

గూడెం మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో.. పటాన్‌చెరులో పొలిటికల్ సీన్‌ ఆసక్తికరంగా మారింది. నీలం మధు - కాటా శ్రీనివాస్‌.. వీళ్లిద్దరూ ఒకే ఒరలో ఉన్న రెండు కత్తులు. అలాంటి కత్తుల మధ్య గూడెం చేరిక మరింత అగ్గిరాజేసినట్టయింది. ఈ త్రయం కలిసికట్టుగా ఉంటారా? కలహాల పేరుతో కాంగ్రెస్‌ను కకావికలం చేస్తారా? ముందు ముందు నియోజకవర్గంలో సాక్షాత్కరించబోయే సీనేంటి?

Patancheru Politics: ఒకే పార్టీలో ఉన్నా.. వేరువేరుగా ప్రయాణం.. మహిపాల్ రాకతో మరీ ఇంట్రస్టింగ్!
Mla Mahipal Reddy In Congress
Follow us on

గూడెం మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో.. పటాన్‌చెరులో పొలిటికల్ సీన్‌ ఆసక్తికరంగా మారింది. నీలం మధు – కాటా శ్రీనివాస్‌.. వీళ్లిద్దరూ ఒకే ఒరలో ఉన్న రెండు కత్తులు. అలాంటి కత్తుల మధ్య గూడెం చేరిక మరింత అగ్గిరాజేసినట్టయింది. ఈ త్రయం కలిసికట్టుగా ఉంటారా? కలహాల పేరుతో కాంగ్రెస్‌ను కకావికలం చేస్తారా? ముందు ముందు నియోజకవర్గంలో సాక్షాత్కరించబోయే సీనేంటి?

అంతా అనుకున్నట్టుగానే జరిగింది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్‌కి బై చెప్పి… అధికార కాంగ్రెస్‌కి జై కొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో హ్యాపీగా హస్తంపార్టీకి నేస్తమయ్యారు మహిపాల్‌రెడ్డి. గూడెం మహిపాల్‌రెడ్డి చేరికతో పటాన్‌చెరు పాలిటిక్స్‌ వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఒకరంటే ఒకరికి పడని ముగ్గురు నేతలు ఒకేపార్టీలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. నీలం మధు, కాటా శ్రీనివాస్‌, మహిపాల్‌ రెడ్డిల రిలేషన్‌ ఎలా ఉండబోతోంది..? ఒకప్పుడు తెగ కొట్టుకున్న ముగ్గురు… కలిసి ముందుకెళ్తారా అన్న చర్చ పొలిటికల్‌ సర్కిల్‌లో రచ్చ లేపుతోంది.

అసలు కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన మహిపాల్‌రెడ్డి విషయం కాసేపు పక్కనపెడితే.. ఒకే పార్టీలో ఉన్న నీలం మధు, కాటా శ్రీనివాస్‌ల మధ్య రిలేషన్‌ అసలేం బాలేదు. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో ఇద్దరి మధ్య టికెట్‌ ఫైట్‌ గట్టిగా నడిచింది. అప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్న మహిపాల్‌రెడ్డిని ఓడించేందుకు.. నాకు టికెట్‌ కావాలంటే నాకు టికెట్‌ కావాలంటూ ఇటు నీలం మధు ఇటు కాటా శ్రీనివాస్ ఇద్దరు రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలకు దిగారు. ఇక ఫైనల్‌గా కాంగ్రెస్‌ అధిష్టానం కాటా శ్రీనివాస్‌కు టికెట్‌ కేటాయించడంతో.. వెంటనే బీఎస్పీలోకి జంప్‌ అయ్యారు నీలం మధు. ఫలితంగా మహిపాల్‌రెడ్డిపై కాటా శ్రీనివాస్‌ స్వల్ప తేడాతో ఓడిపోయాడు. దీంతో నీలం మధుపై కాటా కక్ష పెంచుకున్నారు. నీలం మధు కావాలనే బీఎస్పీలోకి వెళ్లి ఓట్లు చీల్చి తన ఓటమికి కారణయ్యారంటూ బహిరంగంగానే భగ్గుమన్నారు కాటా శ్రీనివాస్‌.

ఇక సీన్‌ కట్‌ చేస్తే… పార్లమెంట్ ఎన్నికల టైమ్‌కి బీఎస్పీ నుంచి మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు నీలం మధు. ఇక మళ్లీ కథ మొదటికొచ్చింది. మెదక్ ఎంపీ సీటు కోసం మళ్లీ ఇద్దరు పోటీ పడ్డారు. అయితే ఈసారి కాటాను కాదని పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చిన నీలం మధుని ఓకే చేసింది అధిష్టానం. అయితే అసెంబ్లీ ఫలితాలు రిపీట్ కాకుండా.. ఓట్లు చీలిపోకుండా… అధిష్టానం ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసింది. మంత్రి కొండా సురేఖ రంగంలోకి దిగారు. ఇద్దరిని కలిపేందుకు మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఎంపీ సీటు దక్కిన నీలం మధుకి సపోర్ట్‌ ఇవ్వాలని కాటాను కోరారు. అయితే మంత్రి ముందే కాటా శ్రీనివాస్‌ భార్య నీలం మధుపై చేయిచేసుకున్నంత పనిచేశారు. కావాలనే పార్టీ మారి ఓట్లు చీల్చారంటూ నిప్పులు చెరిగింది. ఇక ఆ ఇన్సిడెంట్‌తో ఇద్దరి మధ్య వైరం మరింత పెరిగిపోయింది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ… వేరువేరుగానే సాగుతోంది ఇద్దరి ప్రయాణం.

ఇక గూడెం మహిపాల్‌రెడ్డి విషయానికొస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న కాటా శ్రీనివాస్‌, నీలం మధుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఒకే పార్టీ నుంచి సీటు కోసం విడిపోయారంటూ ముమ్మరం ప్రచారం నిర్వహించారు. ఇద్దరిపైనా స్వల్ప మెజార్టీతో గెలిచి బీఆర్ఎస్‌ నుంచి విజయదుంధుబి మోగించారు మహిపాల్‌రెడ్డి. ఫైనల్‌ గా ప్రత్యర్థులు ఉన్న పార్టీలోకి జంప్‌ అయ్యారు మహిపాల్‌రెడ్డి. దీంతో ముగ్గురు మధ్య రిలేషన్‌ ఎలా ఉంటుంది…? అన్న చర్చ జోరుగా సాగుతోంది. కాటా, నీలం మధు రిలేషన్ పక్కన పెడితే… ఈ ఇద్దరితో మహిపాల్‌ రెడ్డి ఎలా ఉంటారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

మొత్తంగా కాంగ్రెస్‌లోకి మహిపాల్‌రెడ్డి చేరికతో పటాన్‌చెరు పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారాయి. మరి ఓకే గూటిలో ఉన్న ముగ్గురు మున్ముందు ఎలా ఉంటారో చూడాలి….!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…