OU Oxygen Park: ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్సిజన్‌ పార్క్.. 200లకు పైగా ఔషధ మొక్కలు, 1000 నెమళ్లు..

| Edited By: Ravi Kiran

Sep 17, 2022 | 3:59 PM

Oxygen Park: ప్రశాంతంగా గుండెల నిండా గాలిపీల్చుకునే ప్రదేశాలే కరువవుతున్న వేళ ఉస్మానియా యూనివర్సిటీ.. పౌరుల మనసు పిల్లగాలుల్లో..

OU Oxygen Park: ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్సిజన్‌ పార్క్.. 200లకు పైగా ఔషధ మొక్కలు, 1000 నెమళ్లు..
Oxygen Park
Follow us on

Oxygen Park: ప్రశాంతంగా గుండెల నిండా గాలిపీల్చుకునే ప్రదేశాలే కరువవుతున్న వేళ ఉస్మానియా యూనివర్సిటీ.. పౌరుల మనసు పిల్లగాలుల్లో ఓలలాడే ఓ స్వచ్ఛమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆక్సిజన్‌ పార్కుని ఆవిష్కరించింది.

కోవిడ్‌ తరువాత ప్రపంచ గమనంలో ప్రభావవంతమైన మార్పొచ్చింది. తిండి సంగతి దేవుడెరుగు, రోజులో కాసేపైనా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలిగితే అదే పదివేలనుకుంటున్నారు జనం. అందుకే ఓయూ క్యాంపస్‌ ఓజోన్‌ డే రోజు ఓ పర్యావరణ పరిరక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్సిజన్‌ పార్కుని ప్రారంభించారు ఎంపీ సంతోష్‌ కుమార్‌.

ఉస్మానియా యూనివర్సిటీలోని 220 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ఆక్సిజన్ పార్కు ఇప్పుడు నగర వాసులకు ఊపిరిపీల్చుకునే అవకాశాన్నిస్తోంది. ఈ పార్కులో 200 పైగా ఔషధ మొక్కలు పెంచుతున్నారు. అంతేకాదు.. సుమారు 1000 కి పైగా నెమళ్ళు ఈ పార్కులో పెంచుతున్నారు. ఓ వైపు ఆరోగ్యం, మరోవైపు ఆహ్లాదాన్నిచ్చే ఈ పార్కు భవిష్యత్‌ తరాలకు ఎంతగానో ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అయిన హరితహారంలో భాగంగా ఈ పార్కుని డెవలప్‌ చేస్తున్నట్టు ఓయూ ప్రొఫెసర్‌ రవీందర్‌ తెలిపారు. మొత్తంగా అలరిస్తోన్న ఆహ్లాదకర వాతావరణం మదిని మైమరపిస్తోందని, ఉదయం, సాయంత్రం వేళల్లో పాసులు ఉన్నవారికి ఈ పార్కులో అనుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..