అయ్యో ఎంత కష్టమొచ్చిందో.. ప్రాణాల మీదకు తెచ్చిన సొంతింటి కళ.. ఏం జరిగిందంటే?

మహబూబ్‌నగర్ జిల్లా జంగమయ్యపల్లిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన అప్పులను తిరిగి చెల్లించలేక భార్యభర్తలు పొలం దగ్గర ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునే లోపే భార్య మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న భర్తను హాస్పిటల్‌కు తరలించారు స్థానికులు.

అయ్యో ఎంత కష్టమొచ్చిందో.. ప్రాణాల మీదకు తెచ్చిన సొంతింటి కళ.. ఏం జరిగిందంటే?
Mbnr News

Updated on: Mar 06, 2026 | 12:16 PM

ఇంటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక భార్య భర్తలు పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జంగమయ్యపల్లిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న రవి, లావణ్యకు గత కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. అయితే ఈ దంపతులు ఇటీవలే ఇంటి నిర్మాణం కోసం రూ.20లక్షలు, డెయిరీ ఫాం కోసం రూ.5లక్షల అప్పు చేశారు. అనుకున్న ప్రకారం ఇళ్లు నిర్మించుకున్నారు.

అయితే అప్పు ఇచ్చిన వ్యక్తులు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడం స్టార్ట్ చేశారు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియని భార్యభర్తలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకన్న ప్రకారం పొలం వద్దకు వెళ్లారు. ఆత్మహత్యకు ముందు రవి చివరి సారిగా హైదరాబాద్‌లో ఉంటున్న తన తమ్ముడు ఆనంద్‌కు వీడియో కాల్ చేసి మాట్టాడాడు. అనంతరం భార్యభర్తలు ఇద్దరూ కలిసి పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అయితే అన్నయ్య మాటలపై అనుమానం కలగడంతో తమ్ముడు ఆనంద్ వెంటనే స్థానికులకు విషయం చెప్పి అన్నా, వధినలను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ స్థానికి పొలం వద్దకు చేరుకునే లోపే భార్య లావణ్య ప్రాణాలు కోల్పోయింది. ఇక కొన ఊపిరితో ఉన్న రవిని వెంటనే అంబులెన్స్ సహాయంతో హాస్పిటల్‌కు తరలించారు స్థానికులు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us