Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు జమ..

|

Jun 14, 2021 | 6:54 AM

అన్నదాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రేపటి(జూన్ 15) నుంచి ఈ నెల 25వ తేదీలోగా రైతుబంధు నగదు కింద ఒక్కో రైతుకు..

Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి రైతుబంధు డబ్బు జమ..
Farmers
Follow us on

అన్నదాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రేపటి(జూన్ 15) నుంచి ఈ నెల 25వ తేదీలోగా రైతుబంధు నగదు కింద ఒక్కో రైతుకు రూ. 5 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది సుమారు 63.25 లక్షల మంది రైతులను(150.18లక్షల ఎకరాలకు) రైతుబంధు పధకానికి అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే అర్హుల జాబితాను సీసీఎల్‌ఏకు అందించినట్లు ఆయన స్పష్టం చేశారు. వీరందరికీ రైతుబంధు సాయాన్ని అందించేందుకు రూ. 7508.78 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది కొత్తగా 2.81 లక్షల మంది రైతులకు పధకం వర్తింపజేశామని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మొదటిసారి ఈ పధకానికి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పాస్‌బుక్ నకలు జిరాక్స్‌లను అందజేయాలని కోరారు. ఇటీవలే కొన్ని బ్యాంకులు వీలినం కావడంతో ఐఎఫ్ఎస్‌సీకోడ్‌లు మారాయి. ఇక ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని.. ఏమైనా అనుమానాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.

Also Read: అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!