Shocking News: వేప పుల్ల ఒకరి ప్రాణాలు బలి తీసుకుంది. మరొకరికి మూడు గంటలపాటు మృత్యువు రుచి చూపింది. మార్నింగ్ వాక్ కి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వేప పుల్ల కోసం ప్రయత్నించగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు మూడు గంటలపాటు మృత్యువుతో పోరాడి మృత్యుంజయుడయ్యారు. ఈ విషాద ఘటన ఖిలా వరంగల్‌లో జరిగింది. వివరాల్లోకెళితే.. వరంగల్ నగరానికి చెందిన చాలామంది వాకర్స్ ఖిలా వరంగల్ రాతికోట పై వాకింగ్ చేస్తుంటారు. ఎప్పటిలాగే వాకింగ్ చేస్తూ కోట కట్టపై నుండి ఇద్దరు వ్యక్తులు వేప పుల్ల సేకరించడానికి ప్రయత్నించారు. అయితే వేప పుల్ల సేకరించే క్రమంలో దారుణం జరిగిపోయింది. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు రాతికోటపై నుండి నీళ్లలో పడ్డారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోగా.. ఈ ప్రమాదంలో సోమప్ప అనే రిటైర్డ్ ఉద్యోగస్తుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మీ నారాయణ అనే మరో వ్యక్తి మృత్యుంజయుడు అయ్యాడు. నీళ్ళలో మూడు గంటలపాటు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న ఆయన్ని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బయటకు తీశారు. కేవలం చిన్న నిర్లక్ష్యం ఇంతటి విషాదానికి కారణమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనతో వాకర్స్ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. కొంచె జాగ్రత్త వహిస్తే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు.
Also read:
Children Protest: మాకు న్యాయం కావాలి.. రోడ్డెక్కిన చిన్నారులు.. ఇంతకీ వారి డిమాండ్ ఏంటంటే..!