తెలంగాణలో అరుదైన నీలిరంగు పుట్టగొడుగులు.. చూశారంటే వావ్ అనాల్సిందే..!
ఖమ్మం జిల్లా పెనుబల్లి లోని కనకగిరి అడవుల్లో స్వదేశీ జాతి అరుదైన స్కై బ్లూ మాష్ రూమ్ ( నీలి రంగు ) పుట్టగొడుగులు దర్శనమిస్తున్నాయి. న్యూజిలాండ్ కు చెందిన అరుదైన నీలి పుట్టగొడుగా గుర్తించారు. తెలంగాణలో ఇంతకుముందు ఇదే జాతి పుట్టగొడుగు బయటపడింది. జూలై 20న ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ చేస్తున్న అటవీ రేంజర్లు ఈ పుట్టగొడుగులలో కొన్నింటిని కనుగొన్నారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి లోని కనకగిరి అడవుల్లో స్వదేశీ జాతి అరుదైన స్కై బ్లూ మాష్ రూమ్ ( నీలి రంగు ) పుట్టగొడుగులు దర్శనమిస్తున్నాయి. న్యూజిలాండ్ కు చెందిన అరుదైన నీలి పుట్టగొడుగా గుర్తించారు. తెలంగాణలో ఇంతకుముందు ఇదే జాతి పుట్టగొడుగు బయటపడింది. జూలై 20న ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ చేస్తున్న అటవీ రేంజర్లు ఈ పుట్టగొడుగులలో కొన్నింటిని కనుగొన్నారు. తాజాగా ఖమ్మం జిల్లా పెనుబల్లి లోని కనకగిరి అడవుల్లో కనిపించడం ద్వారా దీని విస్తరణ పరిధి పెరిగినట్లు తేలినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
“బ్లూ పింక్ గిల్” లేదా “స్కై బ్లూ మష్రూమ్” అని ప్రసిద్ధి చెందిన ఈ జాతి పుట్టగొడుగు దాని మొప్పలలో గులాబీ నుండి ఊదా రంగును కలిగి ఉంటుంది. ఈ పుట్టగొడుగు తన ఆకర్షణీయమైన ఆకాశ నీలం రంగు మెరుస్తూ కనిపిస్తుంది. న్యూజిలాండ్‌కు స్వదేశీ అయిన ఈ జాతి, భారతదేశంలో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. ఎంటొలోమా జాతికి చెందిన అనేక పుట్టగొడుగులు విషపూరితంగా ఉండవచ్చు. అయితే ఈ ప్రత్యేక జాతి భారతదేశంలో విషపూరితమా కాదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే దీన్ని ఆహారంగా వినియోగించకూడదంటున్నారు నిపుణులు.
ఎంటోలోమా జాతికి చెందిన చాలా మంది సభ్యులు విషపూరితమైనప్పటికీ, ఈ జాతి విషపూరితం ఇంకా తెలియదు. దాని నీలం రంగును ఆహార రంగుగా ఉపయోగిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాథమిక రసాయన విశ్లేషణలు కొత్త బయోయాక్టివ్ సమ్మేళనాలను సూచిస్తున్నాయి. అంటు వ్యాధులు, ఆక్సీకరణ ఒత్తిడితో సంబంధం ఉన్న పరిస్థితులతో సహా వివిధ వ్యాధులకు కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడంలో ఈ సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయి అని ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్లు చెబుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




