AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode: ఉప ఎన్నికకు కౌంట్ డౌన్ స్టార్ట్.. సిబ్బందికి సామగ్రి పంపిణీ.. ఉత్కంఠ రేపుతున్న బైపోల్..

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం అధికారులు సిద్దమయ్యారు...

Munugode: ఉప ఎన్నికకు కౌంట్ డౌన్ స్టార్ట్.. సిబ్బందికి సామగ్రి పంపిణీ.. ఉత్కంఠ రేపుతున్న బైపోల్..
Munugodu By Poll
Ganesh Mudavath
|

Updated on: Nov 02, 2022 | 8:43 PM

Share

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం అధికారులు సిద్దమయ్యారు. ఈ మేరకు చండూరులోని డాన్ బాస్కో స్కూల్ లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి సామగ్రి అందించారు. పోలింగ్ తీరుపై మార్గదర్శకాలు, సూచనలు చెప్పారు. అనంతరం వారికి కేటాయించిన ప్రాంతాలకు సిబ్బంది పయనమయ్యారు. కాగా ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుపు సాధిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇవాళ( బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నిక తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కల్పించినట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ చెప్పారు. 35 సున్నిత ప్రాంతాలను గుర్తించామన్న ఆయన.. హింసాత్మక ఘటనలకు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీసం తొమ్మిది మంది సిబ్బంది ఉంటారన్నారు. సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్న ఆయన.. చెక్‌ పోస్టులు గురువారం ఎన్నికలు ముగిసే వరకు ఉంటాయని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిని బైండోవర్‌ చేశామని, ఇప్పటి వరకు రూ.4కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు వివరించారు.

Munugdoe By Poll

Munugdoe By Poll

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి