Kadem Project: ఆ వార్తలన్నీ అవాస్తవాలే.. కడెం ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన అధికారులు..

|

Jul 14, 2022 | 6:48 AM

Kadem Project: ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే నిర్మల్‌లోని కడెం ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది...

Kadem Project: ఆ వార్తలన్నీ అవాస్తవాలే.. కడెం ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన అధికారులు..
Kadem Project
Follow us on

Kadem Project: ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే నిర్మల్‌లోని కడెం ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, అధికారులు 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. అయితే అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉందన్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇక ఇదే సమయంలో తప్పుడు వార్తలు కూడా వైరల్‌ అవుతున్నాయి. కడెం ప్రాజెక్టు తెగిపోయింది అంటూ కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతునున్నాయి. ఈ వార్తలపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. కడెం ప్రాజెక్ట్‌ బ్రేక్‌ అయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆ వీడియోలన్నీ ఫేక్‌ అని అధికారులు తేల్చి చెప్పారు. కడెం ప్రాజెక్ట్‌ గురించి ఇప్పటి వరకు ఇంజనీర్ల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. అయితే పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేవని, వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచి ఉందని తెలిపిన అధికారులు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..