Telangana: తెలంగాణలో పెరిగిపోతున్న ఒబేసిటీ కేసులు.. ఇక్రిసాట్ తాజా నివేదిక ఏం చెబుతోందంటే..?

|

Aug 31, 2023 | 5:27 PM

Telangana: ప్రజలు అధిక మొత్తంలో కార్బోహైడ్రెడ్లు, షుగర్ ఉన్న ఆహారం తీసుకోవడమే ప్రధాన కారణమని ఇక్రిసాట్ తన నివేదికలో పేర్కొంది. ఆగస్టు 30న ఇక్రిసాట్ విడుదల చేసిన అధ్యయన నివేదిక ప్రకారం తెలంగాణలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రోటీన్, అన్ని రకాల పోషకాలు లభించే ఫుడ్ కంటే కార్బోహైడ్రెట్లు ఎక్కువగా ఉండే ఆహారాలనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇంకా ఆరోగ్యవంతమైన పండ్లు, కూరగాయల కంటే మాల్స్‌లో..

Telangana: తెలంగాణలో పెరిగిపోతున్న ఒబేసిటీ కేసులు.. ఇక్రిసాట్ తాజా నివేదిక ఏం చెబుతోందంటే..?
Icrisat On Telangana
Follow us on

Telangana: తెలంగాణలో అధిక బరువు, ఊభకాయంతో బాధపడేవారి సంఖ్య నానాటీకి పెరిగిపోతోందని ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిసాట్) నివేదిక తెలిపింది. ఇందుకు ప్రజలు అధిక మొత్తంలో కార్బోహైడ్రెడ్లు, షుగర్ ఉన్న ఆహారం తీసుకోవడమే ప్రధాన కారణమని ఇక్రిసాట్ తన నివేదికలో పేర్కొంది. ఆగస్టు 30న ఇక్రిసాట్ విడుదల చేసిన అధ్యయన నివేదిక ప్రకారం తెలంగాణలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రోటీన్, అన్ని రకాల పోషకాలు లభించే ఫుడ్ కంటే కార్బోహైడ్రెట్లు ఎక్కువగా ఉండే ఆహారాలనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇంకా ఆరోగ్యవంతమైన పండ్లు, కూరగాయల కంటే మాల్స్‌లో రెడిమేడ్‌గా దొరికే ఫుడ్స్‌ని ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారని, ఇది పోషకాహార లోపానికి కారణంగా మారుతోంది.

ప్రోటీన్ లేని ఆహారం తింటే సమస్యలు, సాంప్రదాయ ఆహారం, ఫుడ్ సప్లై చెయిన్స్ ప్రాముఖ్యత గురించి కూడా ఇక్రిసాట్ నివేదిక ప్రస్తావించింది. ఇదిలా ఉండగా.. పోషకాహార లోపం, ఒబేసిటీ సమస్యలకు గల కారణాలను వెలుగులోని తీసుకురావడం భారతదేశ గ్రామీణ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కోసం సహాయపడుతుందని ఇక్రిసాట్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా, ఒబేసిటీ లేదా అధిక బరువు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఒబేసిటీ కారణంగా టైప్ 2 డయాబెటీస్, హై బీపీ, హృదయ సంబంధిత సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్, ఫ్యాటీ లివర్ సమస్య, పెద్దపేగు క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, యుటరస్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గాల్‌బ్లాండర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..