Nizamabad: రవళి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్‌.. వరుడు సంతోష్ వేధింపులతోనే..

|

Dec 22, 2022 | 10:01 AM

నిజామాబాద్ జిల్లాలో పెళ్లికి కొన్ని గంటల ముందు పెళ్లి కూతురు రవళి ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 11న.. నగరంలోని విజయలక్ష్మి గార్డెన్‌లో

Nizamabad: రవళి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్‌.. వరుడు సంతోష్ వేధింపులతోనే..
Bride Groom Santosh
Follow us on

నిజామాబాద్ జిల్లాలో పెళ్లికి కొన్ని గంటల ముందు పెళ్లి కూతురు రవళి ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 11న.. నగరంలోని విజయలక్ష్మి గార్డెన్‌లో కాసేపట్లో రవళి, సంతోష్‌ పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందు నవీపేట్‌లో పెళ్లి కూతురు రవళి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పెళ్లి కొడుకు వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు రవళి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న రవళి పెళ్లికి కొన్ని గంటల ముందు ఆత్మహత్యకు పాల్పడడం అందరిని కలిచివేసింది. పెళ్లి తరువాత కచ్చితంగా జాబ్‌ చేయాలని, ఆస్తిలో వాటా ఇవ్వాలని సంతోష్‌ డిమాండ్‌ చేయడంతో రవళి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటివరకు పెళ్లి వేడుకల్లో డాన్స్‌ చేసిన రవళి రాత్రి సంతోష్‌తో ఫోన్లో మాట్లాడిన తరువాత ఆమె డల్‌గా మారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తమ కూతురు ఆత్మహత్యకు పెళ్లికొడుకు సంతోష్‌ వేధింపులే కారణమని రవళి తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే రవళి ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు సంతోష్‌ . ఫోటో షూట్‌ కోసమే చివరి ఫోన్‌ కాల్‌లో ఆమెతో మాట్లాడినట్టు, ఆస్తి కోసం, ఉద్యోగం కోసం ఆమెపై ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నాడు. కేసును పూర్తిగా విచారించాలని, కాల్ రికార్డ్స్ అన్నీ బయటకు తీయాలని డిమాండ్ చేసి సంతోష్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, సంతోష్‌ కాల్‌డేటాను పరిశీలించారు. రవళితో పలుసార్లు మాట్లాడిన కాల్స్‌లో ఆస్తులు, ఉద్యోగంపైనే ఎక్కువ మాట్లాడినట్లు గుర్తించారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీపేట్‌ నవవధువు రవళి ఆత్మహత్యకు వరుడు సంతోష్‌ వేధింపులే కారణమని పోలీసులు నిగ్గు తేల్చారు.

సంతోష్ వల్లనే రవళి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో బయటపడింది. ఆస్తులు, ఉద్యోగం విషయంలో ఫోన్‌లో సంతోష్‌ వేధించినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్‌ కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు నిర్ధారించి కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న సంతోష్‌ నుంచి పలు వివరాలు సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..