KTR Book: పట్టుదల, కృషికి మారుపేరు కేటీఆర్.. ‘నిత్య కృషివలుడు’ పుస్తకం ఆవిష్కరించిన మంత్రి వేముల, బాల్కా సుమన్

Nitya Krushivaludu KTR Book: కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్).. పట్టుదల, కృషికి మారుపేరని.. టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిండట్‌గా.. రాష్ట్రమంత్రిగా తెలంగాణ అభివృద్ధికి అనునిత్యం

KTR Book: పట్టుదల, కృషికి మారుపేరు కేటీఆర్.. ‘నిత్య కృషివలుడు’ పుస్తకం ఆవిష్కరించిన మంత్రి వేముల, బాల్కా సుమన్
Nitya Krushivaludu Ktr Book

Updated on: Dec 14, 2021 | 4:07 PM

Nitya Krushivaludu KTR Book: కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్).. పట్టుదల, కృషికి మారుపేరని.. టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిండట్‌గా.. రాష్ట్రమంత్రిగా తెలంగాణ అభివృద్ధికి అనునిత్యం పాటు పడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. నిత్యం కొత్త ఆలోచనలు.. పలు కార్యక్రమాలతో ప్రజలతో మమేకమవుతూ.. ముందుకు వెళుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడూ కౌంటరిస్తూ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ కేటీఆర్ రాష్ట్రానికి దిక్సూచీలా మారారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కేటీఆర్ ఆలోచన విధానంపై రచయిత రాజేష్ నాయక్ రాసిన ‘నిత్య కృషివలుడు’ అనే పుస్తకాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌.. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బోయినపల్లి రంజిత్ రావుతో కలిసి ఆవిష్కరించారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో నిత్య కృషివలుడు కేటీఆర్ పుస్తకావిష్కరణ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రచయిత రాజేష్ నాయక్ కేటీఆర్ కృషినీ , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి వివరించడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు. రాజేశ్ నాయక్ మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌.. అనేది మూడక్షరాల పేరు.. అని అభిమానులు మాత్రం లక్షల్లో ఉన్నారన్నారు. కేటీఆర్‌ కృషిని పుస్తకం రూపంలో వివరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పుస్తకాల వల్ల ప్రజలు, పార్టీ కార్యకర్తలకు ఓ స్ఫూర్తి లభిస్తుందని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ పేర్కొన్నారు.

Also Read:

పాపం పసివాడు.. అమ్మ పొత్తిళ్లకు దూరమై.. మూడేళ్లుగా శిశుగృహాలో అనాథగా..

Lakhimpur Kheri Case: పక్కా ప్రణాళికతోనే ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న.. కేంద్రమంత్రి కొడుక్కి బిగుస్తున్న ఉచ్చు