Preethi Health: మెడికల్‌ విద్యార్థిని ప్రీతి తాజా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే.

|

Feb 25, 2023 | 11:08 AM

సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతికి నిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. ప్రత్యేక వైద్య బృందం ఆమెకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే ప్రీతి ఆరోగ్యం మాత్రం ఇంకా విషంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇందులో భాగంగానే..

Preethi Health: మెడికల్‌ విద్యార్థిని ప్రీతి తాజా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే.
Medical Student Preethi
Follow us on

సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతికి నిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. ప్రత్యేక వైద్య బృందం ఆమెకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే ప్రీతి ఆరోగ్యం మాత్రం ఇంకా విషంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఆరోగ్యానికి సంబంధించి హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. ‘ప్రస్తుతం ప్రీతికి ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మా ప్రత్యేక వైద్య బృందం ఆమెను బతికించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ప్రీతి ఆత్మహత్యయత్నానికి సీనియర్‌ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్‌ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్‌ కాలేజీ, ఎంజీఎం హెచ్‌ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్‌ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్‌ టార్గెట్‌ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఈ కేసులో నిందితుడైన సైఫ్‌ను అరెస్టు చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..