Weather Report: ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో సాయంత్రం 7 గంటల తర్వాత ఉదయం 8 గంటల వరకు జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వచ్చే రెండు రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..

Weather Report: ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
AP and Telangana weather

Updated on: Dec 28, 2025 | 8:55 AM

హైదరాబాద్, డిసెంబర్‌ 28: తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్య అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, మంచిర్యాల, నిర్మల్ సంగారెడ్డి జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మహబూబ్ నగర్,వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది.

  • ఆదిలాబాద్‌లో9.2
  • రాజేంద్రనగర్‌లో10.0
  • పటాన్ చెరువులో 9.2
  • మెదక్‌లో 9.0
  • హనుమకొండలో 11.5
  • రామగుండంలో12.0
  • హయత్ నగర్‌లో 12.6
  • నిజామాబాద్‌లో 13.3
  • దుండిగల్‌లో 11.2
  • హైదరాబాద్‌లో 13.6
  • ఖమ్మంలో 13.4
  • నల్గొండలో 15.0
  • హకీంపేట్‌లో15.6
  • మహబూబ్ నగర్‌లో 15.1
  • భద్రాచలంలో 15.5 డిగ్రీల చొప్పున శనివారం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలా ఉందంటే..

ఏపీలో పొడి వాతావరణం కొనసాగుతుంది. పగటిపూట 24–25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రివేళ కొంచెం చల్లబడి 18–19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు ఇవే..

  • నందిగామ – 30.8°C (రాష్ట్రంలో అత్యధికం)
  • బాపట్ల – 30.7°C
  • తుని – 30.6°C
  • మచిలీపట్నం – 30.4°C
  • కావలి – 30.4°C
  • కర్నూలు – 30.3°C
  • అమరావతి – 30.2°C
  • నెల్లూరు – 30.1°C
  • నంద్యాల – 30°C

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత స్వల్పంగా కొనసాగుతోంది. ఆయా జిల్లా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు ఇవే..

ఇవి కూడా చదవండి
  • ఆరోగ్యవరం – 26.5°C
  • కళింగపట్నం – 27°C
  • విశాఖపట్నం – 27.7°C

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.