Chilli Cultivation: మిర్చి తోటలపై కొత్త రకం రసం పీల్చే తామర పురుగు వ్యాప్తి చెందుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు పరేషాన్‌కు గురవుతున్నారు. వాతావరణ మార్పులు.. విపరీతంగా పురుగుల మందుల వాడకం, బయో మందుల వాడకంతో ఈ రసం పీల్చే కొత్త నల్ల రకం తామర పురుగు మహబూబాబాద్ జిల్లాలో మిర్చి తోటలకు సోకిందని బెంగూళూరు లోనీ ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసర్చ్ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డా శ్రీధర్ అన్నారు. మహబూబబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ లోనీ మిర్చి తోట ను శ్రీధర్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. తెలంగాణలోకి ఈ కొత్త రకం రసం పీల్చే తామర పురుగు మిర్చి తోటలకు వ్యాప్తి చెందింది.
సాధారణ తామర పురుగే అని భావిస్తున్న రైతులు దాని నివారణకు పలు రకాల క్రిమిసంహారిక మందులు ఎక్కువగా కొడుతున్నారు. అయినప్పటికీ పురుగు మాత్రం చావడం లేదు. ఇంకా ఉధృతంగా పెరుగుతూనే ఉన్నాయి. శాస్త్రవేత్తలకు సైతం ఈ కొత్త రకం పురుగు గురించి అంతుబట్టడం లేదు. రైతులు సైతం పురుగు ఉధృతిని ఎలా తగ్గించాలని దిగ్గుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నారు. అయితే, తాజాగా మిర్చితోటను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం వీటి నివారణకు పలు సూచనలు చేశారు. మిర్చి రైతులు సామూహికంగా నీలి, పసుపు రంగు అట్టలను పెట్టి, పురుగు ఉధృతిని గుర్తించి, సిఫారసు చేసిన మందులను వాడాలని శాస్త్రవేత్తలు సూచించారు.
Also read:
Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..
Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..