Rythu Bharosa: రైతు భరోసాపై కొత్త గైడ్‌లైన్స్.. తెలంగాణ రైతులందరికీ ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్.. రూల్స్‌లో మార్పులు..
రైతు భరోసా తొలి విడత సొమ్ము సోమవారం రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. దీంతో లబ్దిదారులు తమ బ్యాంక్ బాలెన్స్ చెక్ చేసుకోవాలి. డబ్బులు జమ అయ్యాయా.. లేదో తెలుసుకోండి. ఒకవేళ జమ కాకపోతే స్టేటస్ చెక్ చేసుకోండి. అయితే ఈ సారి గైడ్ లైన్స్ మారాయి.

సోమవారం నుంచి రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభమైంది. తొలి విడతలో ఎకరం వరకు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం ఇవాళ లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయగా.. నిన్న బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ రైతుల అకౌంట్లో పడుతున్నాయి. 68.90 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుండగా.. 57.45 లక్షల ఎకరాలకు సాయం అందనుంది. ఇవాళ రూ.3,446.94 కోట్ల నిధులు రైతులకు అందనున్నాయి. నేడు తొలి ఎకరానికి రూ.6 వేలు జమ కానున్నాయి.
తొలి ఎకరానికి రూ.6 వేలు
మరో 45 రోజుల్లో రెండు, మూడు విడతల్లో మిగతా నిధులు వేయనున్నట్లు రేవంత్ రెడ్డి ఆదివారం జరిగిన సభలో ప్రకటించారు. యాసంగి సీజన్‌కు ఎకరానికి రూ.6 వేల చొప్పున సాయం అందిస్తున్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. రైతు భరోసా నిధుల్లో నల్గొండ జిల్లా టాప్‌లో ఉండగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు అత్యల్ప నిధులు కేటాయించారు.
మారిన రైతు భరోసా గైడ్ లైన్స్
ఈ సారి రైతు భరోసా నిధుల విడుదలలో రూల్స్‌ను ప్రభుత్వం మార్చింది. గతంలో తొలి రోజు ఎకరం పోలం ఉన్నవారి నుంచి మొదలుపెట్టి విడతల వారీగా అందరికీ నిధులు విడుదల చేసేవారు. కానీ ఈ సారి ఎంత పోలం ఉన్నవారికైనా తొలి విడతలో ఎకరం పొలానికి రూ.6 వేలు పడతాయి. ఇక రెండో విడతలో మూడు ఎకరాలకు, మూడో విడతలో మిగిలిన భూమికి డబ్బులు వేయనున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి ఎకరం కంటే భూమి ఉన్న రైతులకు కూడా తొలి విడతలో ఎకరం భూమికి రూ.6 వేలు ఇస్తున్నారు. దీని వల్ల రైతు భరోసా సొమ్ముల కోసం నెలపాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా తొలి విడతలోనే సొమ్ము జమ అవుతున్నాయి. ఇక కొత్త పాసు పుస్తకాలు పొందిన 6 వేల మంది రైతలుకు కూడా నగదు జమ చేస్తున్నారు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు ఆన్ లైన్‌లో తమ డీటైల్స్ నమోదు చేయించుకోవాలి. ధరణి పోర్టల్‌లో వివరాలు ఖచ్చితంగా నమోదై ఉండాలి. ఇక పాసు పుస్తకంతో పాటు ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ క్లస్టర్ ఏఈఓలకు అందించాలి. ఇక బ్యాంక్ అకౌంట్లో మార్పులు, ఇతర వివరాలు మార్చుకోవాలంటే అధికారులను సంప్రదించాలి. ఈ పనులు చేస్తే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారికి కూడా డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం పేర్కొంది.
