Cheating: భాగ్యనగరంలో నయా మోసం.. పోలీసులమంటూ వచ్చారు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.. ఆపై..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. పోలీసులమంటూ వచ్చిన కొందరు దుండగులు ఓ వ్యక్తిని
Cheating: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. పోలీసులమంటూ వచ్చిన కొందరు దుండగులు ఓ వ్యక్తిని నిలువుదోపిడీ చేశారు. వివరాల్లోకెళితే.. బొమ్మల రామారానికి చెందిన వర్త్యాల లోకేష్ ఓల్డ్ సఫీల్ గూడాలోని పి.బి.కాలనీలో లబ్దిదారుల నుండి రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నాడు. ఇది గమనించిన ఆర్.టి.సి కాలనీకి చెందిన నలుగురు యువకులు.. తాము ఎస్ఓటీ పోలీసులమని చెప్పి అక్రమంగా బియ్యం సేకరిస్తున్న లోకేష్‌ను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆపై అతన్ని బెదిరించి, అతని వద్ద ఉన్న రూ. 19,000 నగదును దోచుకెళ్లారు. దీంతో బాధితులు లోకేష్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. ఆర్‌టీసీ కాలనీకి చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.19,000 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక హ్యూండాయ్ వెర్ణా కారు, ఒక హోండా యాక్టీవా కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.
also read:
నిలకడగా రజినీకాంత్ ఆరోగ్యం.. రజినీ అభిమానులు ఆసుపత్రికి రావొద్దంటూ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
ఏపీ ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ తేదీ ఖరారు.. ఈసారి కొత్త విధానంలో సీట్ల కేటాయింపు.