వావ్.. అమేజింగ్.. కోళ్లు, మేకలు, పాడి పశువులకు అందాల పోటీలు.. సంక్రాంతి సంబురం అదుర్స్..

సంక్రాంతి సందర్భంగా కోడి పుంజుల పందాలు, రంగుల ముగ్గులు, పతంగులు, జాతరలు రెగ్యులర్ గా చూస్తుంటాం.. కానీ రొటీన్ కు భిన్నంగా ఆ ఊర్లో నిర్వహించిన మూగజీవుల అందాల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి.. రైతు జీవిత నేస్తాలుగా తోడ్పడే పాడి గేదెలు, దుక్కిటేద్దులు, ఆవులు, కోళ్లు మేకలతో అందాల పోటీలు నిర్వహించారు..

వావ్.. అమేజింగ్.. కోళ్లు, మేకలు, పాడి పశువులకు అందాల పోటీలు.. సంక్రాంతి సంబురం అదుర్స్..
Animal Beauty Contests in Narsampet

Edited By:

Updated on: Jan 15, 2026 | 6:50 PM

సంక్రాంతి సందర్భంగా కోడి పుంజుల పందాలు, రంగుల ముగ్గులు, పతంగులు, జాతరలు రెగ్యులర్ గా చూస్తుంటాం.. కానీ రొటీన్ కు భిన్నంగా ఆ ఊర్లో నిర్వహించిన మూగజీవుల అందాల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి.. రైతు జీవిత నేస్తాలుగా తోడ్పడే పాడి గేదెలు, దుక్కిటేద్దులు, ఆవులు, కోళ్లు మేకలతో అందాల పోటీలు నిర్వహించారు.. పశు పోషణను ప్రోత్సహించేలా అక్కడ నిర్వహించిన అందాల పోటీలు చూపరులను అబ్బుర పరిచాయి. ఈ విచిత్ర సంబరాలు వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగాయి.. శాంతి సేన రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి తో పాటు, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు.. పశు పోషణను ప్రోత్సహించే దిశగా ఈసారి సంక్రాంతికి డిఫరెంట్ గా ప్లాన్ చేసి నియోజకవర్గ ప్రజలంతా చర్చించుకునేలా చేశారు..

నియోజకవర్గ స్థాయి పాడి పశువులు, కోళ్లు, మేకల అందాల పోటీలు నిర్వహించారు.. వాటిలో రైతు పెంపకంలో కండపుష్టి కలిగి ఉండి, ఆ రైతులతో నేస్తంలా మెదిలే మూగజీవులను ఇక్కడ ప్రదర్శించారు. వీటిలో చాలా రకాల కోడి పెట్టలు, కోడి పుంజులు మేకలు, గొర్రెలు, ఆవులు, దుక్కిటెద్దులు పోటీపడ్డాయి.. అంతేకాదు పెట్ డాగ్స్ తో కూడా కొంతమంది ఇక్కడ పోటీ పడ్డారు.. మరి కొంతమంది పాడి గేదలు దుక్కిటేద్దులు ఆవులు ఇక్కడ ప్రదర్శించారు.

వీడియో చూడండి..

పండుగల వేళ మూగజీవులను బలివ్వడం కామన్ గా చూస్తుంటాం.. కానీ ఇక్కడ పాడి పశువుల పోషణను ప్రోత్సహించేలా డిఫరెంట్ దీంతో ఈ వేడుక నిర్వహించారు. మూగజీవులు వాటి పెంపకపుదారులతో నడుచుకుంటున్న తీరు చూసి అంతా షాక్ అయ్యారు. కేవలం పెట్ డాగ్స్, క్యాట్స్ మాత్రమే కాదు.. ఆవులు, గేదెలు దుక్కిటేద్దులు, కూడా ఆ రైతుతో ఎలా చెబితే అలా నడుచుకోవడం ఈ ఫ్యాషన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా అందర్నీ ఆకట్టుకుంది.

మూగజీవుల పోషణలో వాటితో నేస్తాలుగా మెదులుతున్న రైతులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..